కీర్తికి రెండు కోట్లు..శ్రీయకు 60 లక్షలు

కొందరికి ఆదిలోనే అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరకి కాస్త ఆలస్యంగా వస్తుంది. మహానటి సావిత్రి ప్రధాన పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్‌కు ప్రారంభంలోనే టాలీవుడ్‌ రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలికింది. నాలుగేళ్లలోనే రెండు కోట్ల పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగిపోయింది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో ఫుల్‌ బిజీగా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాకు అక్షరాల కోటిన్నర తీసుకుంటుంది. తమిళంలో రెండు కోట్లు ఇస్తేగానీ కొత్త చిత్రానికి సైన్‌ చేయడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సూత్రాన్ని అమ్మడు గట్టిగానే ఫాలో అవుతోంది. ఇదిలా ఉంచితే అందాల నటి శ్రీయ కూడా కోటి వరకూ తీసుకుంటుంది. కెరీర్‌ పరంగా తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు డిస్కౌంట్‌ కూడా ఇస్తోందట. పారితోషికం తక్కువైనా పాత్ర మంచిదైతే ఓకే చెప్పేస్తుందట. లేటెస్టుగా విక్టరీ వెంకటేష్‌ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు నిర్మించనున్న సినిమాకి నాయికగా ఎంపికైంది. ఈ సినిమా కోసం శ్రీయ కేవలం 60లక్షల పారితోషికం తీసుకుంటోందిట. దీనిని బట్టి ఏం అర్థమవుతోంది? నిర్మాతలతో సత్సంబంధాలు కేవలం డబ్బుతో ముడిపడినవి కావు. సుదీర్ఘ కాలం సత్సంబంధాలు కొనసాగిస్తేనే ఇక్కడ మనుగడ.. అని శ్రీయ ప్రాక్టికల్‌గా ప్రూవ్‌ చేశారు. వాస్తవానికి వెంకీ సరసన కాజల్‌ నటిస్తుందని ప్రచారం సాగినా చందమామ కోటి డిమాండ్‌ చేసిందని తెలుస్తోంది. ఈ అనుభవ పాఠం నుంచి మరి నవతరం నాయికలు నేర్చుకుంటారా? లేదా?

Comments