13 నంబర్లు కాదు. మీరు వాడుతున్న పది నంబర్లే ఫిక్స్. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టెలికాం శాఖ తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు మొబైల్ నంబర్లు మారవు. అది కేవలం మెషిన్ టు మెషిన్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. మొబైల్‌లో వాడుతున్న సిమ్ నంబర్లేమీ మారవని కూడా తెలిపింది. ఇదిలావుండగా పదమూడు అంకెలుండే ఎం2ఎం మొబైల్ నంబర్లు జులై 1 నుంచి అమలు చేస్తారు. వీటి ప్రభావం ఇప్పటికే సాధారణ వినియోగదారులు వాడుతున్న మొబైల్ సిమ్‌లపై ఉండదని వాటితో సంబంధమే లేదని టెలికాం శాఖ తెలిసింది. ఇప్పటికే 10 అంకెల ఎం2ఎం మొబైల్ వినియోగదారుల నంబర్లు మాత్రమే అక్టోబర్ 1 నుంచి మారుతాయని పేర్కొంది. ఎం2ఎం పరికరాలు ఇంటర్నెట్ సహాయంతో నడుస్తాయి. అవి క్రెడిట్ కార్డు స్వైపింగ్ యంత్రాల్లాగా ఉంటాయి. ఇవి కూడా సిమ్‌ల సహాయంతోనే పనిచేస్తాయి. ఏదైనా లావాదేవీ జరిగినప్పుడు సిమ్ సంఖ్య నుంచి బ్యాంకు సర్వర్‌కు ఇంటర్నెట్ ద్వారా అది నమోదు అవుతాయన్నమాట. రవాణా, విద్యుత్, సేవలు, రవాణా సామగ్రి, వైద్యం, సముద్ర రవాణా వంటి రంగాల్లో ఎం2ఎం కమ్యూనికేషన్‌కు విశేష ప్రాధాన్యం ఉంటుంది.

Comments
Post a Comment