మూవీపై మిశ్రమ స్పందన
స్క్రీన్‌ప్లే పెద్ద లోపం
అత్తారింటికి దారేది ఛాయలు
పవర్‌స్టార్ మానియా
అభిమానులకు మాత్రమే పండుగ
ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి
అజ్ఞాతవాసికి అంత సీన్ లేదని మొదటి షోతోనే తేలిపోయింది. బాక్సాఫీస్ షేక్ చేయడం గ్యారంటీ అని రూ.200 కోట్ల క్లబ్‌లో వపర్ స్టార్ చేరిపోతాడని ఎగిరే పక్షికి పసాలా నూరేశారు చాలా మంది అభిమానులు..పవన్ గ్యాంగ్..ఇది పక్కన పెడితే అజ్ఞాతవాసి చిత్రాన్ని ఎప్పటిలాగే మంచి హైప్ క్రియేట్ చేశారు. అందుకు తెలుగురాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలో పవన్ బొమ్మే పడింది. విపరీతమైన ఇమేజ్ ఉన్న పవన్ మానియా ఏంటో థియేటర్ల వద్ద సందడి చూస్తే అర్థమవుతుంది. అభిమానులు మాత్రం ఎప్పటిలాగే సూపర్ హిట్..హండ్రడ్ డేస్ గ్యారంటీ..కలెక్షన్లు కుమ్మేస్తాయి..రికార్డులన్నీ బద్దలైపోతాయి. పవర్ స్టార్ మ్యాజిక్..త్రివిక్రమ్ క్రియేటివిటీ అహో..ఓహో అంటూ థియేటర్ల వద్ద సందడి చేసేస్తున్నారు. తప్పదు..అభిమానులు..ఆ మాత్రం చెప్పుకోకపోతే కుదరదు.. పవన్ అంటే ప్రాణాలిచ్చే అభిమానులున్నవారు కాబట్టి స్క్రీన్ మీద పవర్ స్టార్ కనిపిస్తేనే చాలు సూపర్ హిట్టే అనే ధ్యాస వారిది. అభిమానం అటువంటిది. తొలి ఆట అర్ధరాత్రి ఒంటిగంటకు పడింది. ఫస్ట్ ఆఫ్ సాగదీత చిరాకు కలిగించింది. సినిమా చూసిన వారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. భారీ అంచనాల నడుమ నేడు (జనవరి 10న) విడుదలైన 'అజ్ఞాతవాసి' సినిమాపై మిశ్రమ స్పందన వస్తోంది. పవన్ అభిమానులు ఆహా ఓ¬ అంటున్నా.. సాధారణ ప్రేక్షకుడు మాత్రం పెదవి విరుస్తున్నాడు.
గొప్ప దర్శకుడిగా..మాటల మాంత్రికుడిగా..క్రియేటర్‌గా పేరొందిన త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అనుకున్నంత స్థాయిలో తీయలేకపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది త్రివిక్రమ్ సినిమాయేనా? అన్న అనుమానం కలుగుతుంది. త్రివిక్రమ్ సినిమాలన్నీ చిన్న కథ..దాని చుట్టూ భావోద్వేగాలు..చక్కని హాస్యం..కథనం అద్భుతంగా ఉంటుంది. అజ్ఞాతవాసిలో హాస్యం మినహా (అది కూడా సెకెండాఫ్) ఇంకేం లేదు. సినిమాకు పెద్దలోపం స్క్రీన్ ప్లే. సినిమా అంతా చాలా రిచ్‌గా తీసినా..అసలు విషయం లేకపోతే ఎందుకు? అన్న కామెంట్లూ వినిపిస్తున్నాయి. పవన్ ఉన్నాడు కనుక ఈ చిత్రం చూడాలి.. అంతే అన్నట్టు ఉంది.
సంక్రాంతి బరిలోకి 12న బాలయ్య వస్తున్నాడు. జై సింహాతో..ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలే పెద్దవి. కనుక అజ్ఞాతవాసి కలెక్షన్లకు కొదవ ఉండదు. ఇప్పటికే అన్ని థియేటర్లను అజ్ఞాతవాసికే కేటాయించడంతో ఓ రేంజ్‌లో కలెక్షన్లు రావడం ఖాయం. సంక్రాంతి సెలవులు కూడా కలిసొచ్చే అంశం. సినిమా ఎంత చెత్తగా ఉన్న త్రివిక్రమ్‌ను మెచ్చే ఫ్యామిలీ ఆడియన్స్...పవర్ స్టార్ అభిమానులు కచ్చితంగా చూస్తారు. ఆ లెక్కన చూస్తే ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్ అన్న రీతిలో కలెక్షన్లకు ఢోకా ఉండదు. అయితే ఎప్పటి నుంచే పవర్ స్టార్ కలలు కంటున్న రూ.200 కోట్ల క్లబ్‌లోకి మాత్రం చేరడం చాలా కష్టం. ఇండియాలో ఉన్న 6 సౌత్ ఇండియన్ అలాగే నార్త్ ఇండియన్ సినిమాలతో కలిపి దాదాపు 39 సినిమాలు 200 కోట్ల బాక్స్ ఆఫీస్‌ను ఈజీగా అందుకున్నాయి. ప్రస్తుత రోజుల్లో స్టార్ హీరో సినిమా అంటే ఆ మార్క్‌ను అందుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. సౌత్ బాహుబలి రెండు భాగాలు అలాగే కబాలి - మెర్సల్- ఐ- రోబో సినిమాలు మాత్రమే 200 మార్క్ ను అందుకున్నాయి. ఇక తెలుగులో ఇంకా పూర్తి స్థాయిలో ఎవరు అందుకోలేకపోతున్నారు. బాహుబలి తప్ప. మహేష్ స్పైడర్ ఆ మార్క్‌ను అందుకుంటాడు అనుకున్నారు.
కానీ సినిమా చూశాక అంత సీన్ లేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని రిలీజ్‌కు ముందు జరిగిన ప్రచారం...సినిమా విడుదలైన తరువాత అంత సీన్ లేదని తేలిపోయింది.
అజ్ఞాతవాసితో అనిరుథ్ సూపర్ హిట్
ఇంతవరకూ మెగా ఫ్యామిలీకి సూపర్ హిట్ ఆల్బమ్‌లు అందిస్తూ వచ్చిన డీఎస్పీ..అజ్ఞాతవాసికి దూరమయ్యాడు. బహుశా త్రివిక్రమ్‌కు డీఎస్పీ మ్యూజిక్ బోరుకొట్టిందేమో. కారణం ఏదైనా కావొచ్చు. అజ్ఞాత వాసి అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. అంతకు మించి ఆర్‌ఆర్ ఇరగదీశాడు. ఒక్కో పాట ఒక్కో రీతిలో మాయ చేశాడు. టాలీవుడ్‌కు కొత్త సంగీతాన్ని అందించాడు.

Comments
Post a Comment