ముంబయి: జాతీయ గీతం వినిపిస్తే ఎక్కడున్నా తాను మాత్రం లేచి నిలబడతానని బాలీవుడ్ నటి కాజోల్ పేర్కొన్నారు. సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించారు. 'దేశం తరఫున నేను స్పందించలేను కానీ. జాతీయ గీతం వినిపిస్తే మాత్రం నేను ఆటోమేటిక్‌గా నిలబడతా' అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పలు సూచనలు పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడటానికి గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బలవంతంగా ప్రజల మీద దేశభక్తిని రుద్దడం సరైన పద్ధతి కాదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సవరణలు చేయాల్సిందిగా కోర్టును కేంద్రం కోరింది.

Comments
Post a Comment