ముంబయి : కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసిన బర్డ్ ఫ్లూ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ విస్తరించే అవకాశాలున్నాయని పశుసంవర్ధకశాక అధికారులు అప్రమత్తమయ్యారు. కర్ణాటకలో ప్రబలిన ఈ వ్యాధి మహారాష్ట్రకు వ్యాపించకుండా సరిహద్దుల్లోని 11 జిల్లాల్లో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముంబయి నగరంతోపాటు షోలాపూర్, కొల్హాపూర్, సాంగ్లీ, లాతూర్ తోపాటు కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో చికెన్, గుడ్ల అమ్మకాలు తగ్గాయి. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా కోళ్ల ఫారాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బర్డ్ ఫ్లూపై 11 జిల్లాల అధికారులను అలెర్ట్ చేశామని ఉన్నతాధికారులు వివరించారు.

Comments
Post a Comment