ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు..చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నా పట్టడం లేదు. తాగేస్తున్నారు..తాగి వాహనాలు నడిపేస్తున్నారు. అదుపు తప్పి ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవాళ్లకు కడుపుకోతను మిగిల్చుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మద్యం మత్తులో డ్రైవ్ చేసి కారును చెట్టుకు బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో విశ్వజిత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యంమత్తులో కారు నడిపడమే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసుల వెల్లడించారు. ఇదిలాఉండగా, రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, మద్యం తాగి వాహనం నడిపిన 37 మందిపై కేసులు నమోదయ్యాయి. 25 కార్లు, 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments
Post a Comment