లక్షల్లో పెట్టుబడి..కోట్లలో రాబడి

                           జీఎస్టీ సూపర్‌ డూపర్‌ హిట్‌
ఆర్జీవీ ఎంత తెలివైనవాడో జీఎస్టీ కలెక్షన్లు బట్టి చెప్పొచ్చు. అతగాడు తీసిన గాడ్‌, సెక్స్‌.. ట్రూత్‌ కోట్లు కొల్లగొడుతుంది. ఈ చిత్రంపై మహిళా సంఘాలు ఆందోళన చేశారు. వర్మపై కేసులూ పెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే తన జీఎస్టీ సినిమాలను కాలేజీ అమ్మాయిలే ఎక్కువ మంది చూశారని, వారందరికీ ప్రత్యేకంగా థాంక్స్‌ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే.. 'గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌'(జీఎస్టీ) పేరు పెట్టి దాదాపు నెల రోజులుగా అన్ని ప్రచారమాధ్యమాల్లోనూ ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసిన వర్మకు సొమ్ములపరంగా బాగానే వర్కౌట్‌ అయిందట. 'జీఎస్టీ'కి అయిన ఖర్చు రూ. 70 లక్షలుకాగా, ఇప్పటివరకూ వచ్చిన వసూళ్లు రూ. 11 కోట్లు అంటున్నాయి సంబంధిత వర్గాలు. 19 నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రానికి అయిన ఖర్చులో ఎక్కువ మొత్తం ఒక్క మియా మాల్కోవాకే వెళ్లిందట. మ్యూజిక్‌ కొట్టిన కీరవాణి సంగతీ తేలలేదు. అన్ని అనవసరపు విషయాలు చెప్పే వర్మ, తన జీఎస్టీ వసూళ్ల గురించి మాత్రం ట్వీటివ్వలేదు.

Comments