కత్తి వేట పవన్ అభిమానులకు గట్టిగానే తగిలినట్టు ఉంది. వాస్తవాలు పక్కన పెడితే..కత్తి..పవన్ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కత్తి వ్యాఖ్యలకు పవన్ అభిమానులు ఎంతే ఘాటుగా సమాధానమిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో కత్తి మరింత పదునుగా మాట్లాడారు. చాలా మందికి ఆఫ్ ద రికార్డ్‌గా తెలిసిన విషయాలన్నీ పబ్లిక్‌గా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చాడు. పవన్, త్రివిక్రమ్, పూనమ్ కౌర్‌లను విమర్శిస్తూ మాట్లాడాడు. కత్తి మహేష్ కామెంట్లకు పవన్ అభిమానులు హర్ట్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో కత్తి మహేష్ చేస్తున్న విమర్శలకు కుప్పలు తెప్పలుగా సెటైర్లు, కౌంటర్లు ఇస్తున్నారు పవన్ అభిమానులు. అయితే, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రుకు చెందిన ఓ యువకుడు విపరీత పోకడకు పోయాడు. పవన్‌కల్యాణ్‌పై కత్తి మహేష్ చేస్తున్న వ్యాఖ్యలకు మనస్తాపం చెందిన జ్యోతికృష్ణ అనే యువకుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కి చస్తానంటూ బెదిరింపులకు దిగాడు. సమాజంలో ఎన్నో సమస్యలుంటే కత్తిమహేష్ కేవలం పవన్ కళ్యాణ్ మీదే విమర్శలు చేస్తుండటం కేవలం దురుద్దేశ్యంతో చేస్తున్నవేనని అన్నాడు.
వ్యక్తిగత విమర్శలకు దిగుతోన్న కత్తిమహేష్ పై పోలీసులు తక్షణమే చర్యతీసుకో వాలని జ్యోతికృష్ణ డిమాండ్ చేశాడు. సెల్ టవర్ విషయం స్థానికంగా కలకలం సృష్టించడంతో అక్కడికి చేరుకున్న పవన్ అభిమానులు కత్తి మహేష్ కు విరుద్ధంగా నినాదాలు చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు సెల్ టవర్ మీద ఉన్న జ్యోతికృష్ణను. ఎట్టకేలకు స్థానికులు, పోలీసులు సమదాయించడంతో కిందకి దిగడంతో కథ సుఖాంతమైంది.

Comments
Post a Comment