కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా ఏళ్ల తరువాత నటిస్తునన చిత్రం గాయత్రి. మోహన్‌బాబుతో పాటు శ్రీయ, అనసూయ, నిఖిలా విమల్, మంచు విష్ణు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ 'రాముడు చేసింది తప్పే అయితే నాదీ తప్పే' అంటూ మోహన్ బాబు ఉన్న ఫస్ట్‌లుక్ మంచి అప్లాజ్ వచ్చింది. సెకెండ్ లుక్ అదిరిపోయేలా డిజైన్ చేశారు. శ్రియ కూర్చుని ఉంటే విష్ణు జెడ వేస్తున్న లుక్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా మూడో లుక్‌ను విడుదల చేశారు. మోహన్ బాబు కుమార్తెగా నటిస్తున్న నిఖిలా విమల్‌తో కూడిన పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్‌లో..'నేనీరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మా నాన్న..' అని రాసుంది. ఇందులో మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మదన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాకు మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments
Post a Comment