ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ విజయం సాధించింది. టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన క్వార్టర్స్‌లో వీరిద్దరూ తలపడ్డారు. రెండు వరుస గేమ్‌ల్లో ఓడిపోయిన సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది. 37 నిమిషాల పాటు సాగిన పోరులో సింధు ఏ కోణంలో కూడా పోటీ పడలేకపోయింది. కాగా మ్యాచ్ ఆరంభం నుంచి సైనా.. పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సైనా.. అదే జోరుతో రెండో గేమ్‌ను ఆరంభించింది. మధ్యమధ్యలో మాత్రమే సింధు నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న సైనా 21-19తో రెండో గేమ్‌ను సొంతం చేసుకుని మ్యాచ్ గెలుచుకుంది. అయితే క్వార్టర్స్‌లో విజయం సాధించిన సైనా సెవిూఫైనల్‌కు దూసుకెళ్లింది. సైనా-సింధు ఇప్పటి వరకు అంతర్జాతీయ వేదికపై మూడు సార్లు తలపడగా రెండుసార్లు సైనానే విజయం సాధించింది.

Comments
Post a Comment