అజ్ఞాతవాసికి లార్గో'పంచ్‌'

'అజ్ఞాతవాసి'కి కష్టాలు వీడడం లేదు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు రికార్డులు తిరగరాస్తుందని, టాలీవుడ్‌ ఓ సెన్సేషనల్‌ అని ప్రచారం ఓ లెక్కలో చేసుకున్నారు. తీరా తెరపైకి వచ్చాక ఇంత డిజాస్టర్‌ అవుతుందని పాపం అభిమానులు కూడా ఊహించలేదు. మొత్తానికి పవన్‌-త్రివిక్రమ్‌ కాంబోలో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇప్పుడిప్పుడే అజ్ఞాత వాసి టాపిక్‌ చప్పపడుతుందనుకునేలోగా మరో హాట్‌ టాపిక్‌ వైరల్‌ అవుతోంది. ఈ సినిమా కథాంశం ఫ్రెంచి మూవీ 'లార్గోవించ్‌' నుంచి కాపీ చేశారని ప్రచారమైంది. ఆ క్రమంలోనే 'లార్గోవించ్‌' కాపీ రైట్స్‌ కొనుక్కున్న టీసిరీస్‌ వాళ్లతో బేరం మాట్లాడుకున్న 'ఆజ్ఞాతవాసి' మేకర్స్‌ సైలెంట్‌గా డీల్‌ సెట్‌ చేశారని వెబ్‌లో ప్రచారమైంది. ఇక ఆజ్ఞాతవాసి కాపీ క్యాట్‌ వివాదం .. సమసిపోయి రిలీజైపోయిందిలే అనుకుంటే.. ఈలోగానే లార్గోవించ్‌ దర్శకుడు జెరోమి సల్లే మరో పంచ్‌ వేశాడు. ''ఆజ్ఞాతవాసి సినిమా చూశాను. నా సినిమాకు ఇంచుమించు దగ్గరగానే ఉంది'' అని ఇదివరకూ రిలీజ్‌ టైమ్‌లో ట్వీట్‌ చేసిన జెరోమి సల్లే ప్రస్తుతం ఆజ్ఞాతవాసి టీమ్‌కి లీగల్‌ నోటీసులు పంపించేందుకు సిద్ధమవుతున్నాడుట. ఆ మేరకు మరోసారి ఆయన ట్వీట్‌ కలకలం రేపింది. ''ఇండియన్లు కాపీ కొట్టడం కాదు.. ప్రతిభ, క్రియేటివిటీ చూపించండి!'' అంటూ సూటిగానే పంచ్‌ వేశాడు మనోడు. ట్వీట్‌లో చురకలు వేసే ప్రయత్నం చేశాడు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ సహా అన్నిచోట్లా ఇండియన్‌ సినిమాలు కాపీలు అని పరోక్షంగా తిట్టాడు ఫ్రెంచి డైరెక్టర్‌. అయితే టీసిరీస్‌తో సెటిల్‌ చేసుకున్నాక కూడా 'ఆజ్ఞాతవాసి' టీమ్‌కి ఇంకా లార్గోవించ్‌ దర్శకుడికి లీగల్‌ నోటీసులు పంపే హక్కు ఉందా? అన్నది లాజికల్‌ పాయింట్‌. మొత్తానికి త్రివిక్రమ్‌ తాట తీసిన తెలుగు మీడియా.. తొలి నుంచి కాపీ అని ప్రచారం చేసి చివరికిలా కొంప ముంచింది.

Comments