తెలుగు సినీ చరిత్రలో అజ్ఞాత వాసి రికార్డులు తిరగరాస్తోంది. ఎన్నో అంచనాలు..మరెన్నో టార్గెట్లు పెట్టుకుని వచ్చిన ఆ చిత్రం ఆత్యాశకుపోయి..రోజుకు ఏడు షోలు వేసుకునే విధంగా జీవో కూడా రప్పించుకుంది. అభిమానులు పండగ మూడ్‌తో థియేటర్‌లోకి కూర్చున్నారు. అంతే పవన్‌నుచూసి చప్పట్లు కొట్టారు తప్పా సినిమాలో విషయం లేదని తేలిపోవడంతో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. సినిమా విజయం..అపజయం రెండూ స్పోర్టివ్‌గా తీసుకోవాలి..కానీ అభిమానులు రగిలిపోతున్నారు. పవన్ వరుసుగా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడడంతో అభిమానులు తలెత్తుకు తిరగలేక మానసికంగా కుంగిపోతున్నారు. బట్ ..ఇలా కుంగిపోవద్దు..దైనినైనా పాజిటివ్‌గానే తీసుకోవాలని అభిమానులు తెలుసుకోగలగాలి. ఇకపోతే సినీ చరిత్రలో ఇంత వరకూ ఓ పెద్ద హీరో సినిమా విడుదలైన మూడో రోజే షో పడకపోవడం ఒక్క అజ్ఞాతవాసికే దక్కుతుంది. విశాఖ జిల్లా పెందుర్తిలో లక్ష్మీకాంత్ థియేటర్ రెండు స్క్రీన్‌లలో ఆటలు రద్దు చేశారు. రెండు స్క్రీన్లు కలిపి పది మంది మాత్రమే అజ్ఞాతవాసి చూసేందుకు వచ్చారు. దీంతో యాజమాన్యం ఆటను రద్దు చేసింది. థియేటర్ ప్రారంభం నుంచి ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు లేక ఆటను రద్దు చేయడం ఇదే ప్రథమం. అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్ జై సింహకు కూడా తగిలింది. లక్ష్మీకాంత్ థియేటర్లలో జై సింహ అడ్వాన్స్ బుకింగ్ కూడా నిలిపివేసింది. ఇలా అత్యాశకపోయి ఇమేజ్ ఉన్న స్టార్లు ఇలా తమ పరువు తీసుకుంటున్నారు. సినిమా ఎలా ఉన్నా సరే విడుదలైన రెండు మూడు రోజుల్లోనే కలెక్షన్లు కొల్లగొట్టాలని చూస్తున్న బడా నిర్మాతలకు..స్టార్‌స్టార్ హీరోలకు..గొప్పలు చెప్పుకునే దర్శకులకు ఇదొక చెంపపెట్టుగా నిలిచింది.

Comments
Post a Comment