ఆప్కో బ్రాండ్ అంబాసిడర్
పూనమ్ కౌరా!!
బాబుగారు తలుచుకుంటే..సారి రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా? అన్నట్టు ఉంది ఆప్కో బ్రాండ్ అంబాసిడర్ నియామకం. తెలుగువెలుగుకు మా అంత ఎవరూ కష్టపడడం లేదు అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం తెలుగుదనం ఉట్టిపడే ఆప్కో వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ తెలుగువారిని కాదని పంజాబీ అమ్మాయిని పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్..కత్తి..మధ్యలో పూనమ్ కౌర్..వ్యవహారంలో ఆప్కో బ్రాండ్ అంబాసిడర్ ప్రస్తావన వైరల్ అవుతోంది. ఇంతవరకూ ఆప్కో బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర్ అని చాలా మందికి తెలియదు. కత్తి ప్రెస్‌మీట్ పెట్టేంతవరకూ. అదలావుంచితే...తెలుగులో గొప్పగొప్ప వాళ్లు ఉన్నారు. క్రీడల్లో రాణించి దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినవాళ్లూ ఉన్నారు. అనేక రంగాల్లో సేవచేస్తున్న వాళ్లూ ఎంతో మంది ఉన్నారు. వీళ్లందర్నీ కాదని ఆ పంబాబీ అమ్మాయిని ప్రమోట్ చేయడం వెనుక ఎవరి హస్తం ఉందో..ఆలోచిస్తుంటే నిజంగా ఏదో ఉందనిపిస్తుంది కదూ...పూనమ్ కౌర్ టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్ కానేకాదు. చిన్న చిన్న పాత్రలు..అంతకు మించి అందాల ఆరబోతకూ వెనుకాడని పాత్రలే దక్కాయి. తెలుగుదనం ఉట్టిపడే ఆప్కో వస్త్రాలకు ఈమెనే ఎందుకు ఎంపిక చేశారు? సర్కారుకు మద్దతు తెలిపే ఏ స్టార్లైనా సిఫారసు చేశారా? మొత్తానికి ఆప్కో బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Post a Comment