మాస్ మహారాజా .. ఈ సౌండింగే వేరు.. ఆ శబ్ధం వినబడితే చాలు చెవి కోసుకునే వీరాభిమానులున్నారు. ప్రత్యేకించి ఆయన రవితేజ అని చెప్పాల్సిన పనేలేదు. మాస్ రాజా అని చెబితే చాలు. ఊరి చివర పాలెగాడి నుంచి ఊళ్లో దొరబాబు వరకూ.. స్కూలు పిల్లలు.. కాలేజ్ స్టూడెంట్స్ నుంచి.. కట్టమీద కూలి పనికి పోయే వాళ్లు.. ఆఫీసుల్లో టక్కు టై కట్టుకుని 9-6 డ్యూటీ చేసుకునే సాఫ్ట్‌వేర్ బాబుల వరకూ.. ఇలా ఏ కేటగిరీని టచ్ చేసినా.. మాస్ మహారాజాకి అభిమానులున్నారు. అందుకే కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితం! అనుకున్న ఇండస్ట్రీలో తనకు కూడా ఓ ఫుల్ లెంగ్త్ పేజీ ఉందని నిరూపించగలిగాడు రవితేజ. అదంతా అసమాన ప్రతిభతోనే సాధ్యమైంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పరిశ్రమలో ప్రవేశించినా, అనుకోకుండా హీరో అయి ఇంతింతై అన్న చందంగా ఎదిగాడు. లేటుగా వచ్చినా .. నే లేటెస్టుగా వస్తా..! అని నిరూపించిన ఏకైక హీరో కూడా మాస్‌రాజానే. ఒంట్లో ఎనర్జీ.. గుండెల్లో దమ్ముంటే ఇండస్ట్రీలో ఎంత ఎత్తుకు అయినా ఎదగొచ్చు అని నిరూపించిన మెస్మరైజింగ్ స్టార్ రవితేజ. చిరంజీవి తర్వాత స్వయంకృషితో పరిశ్రమలో ఎదిగిన హీరో. మెగాస్టార్ ఇన్‌స్పిరేషన్‌తో ఎదిగిన హీరో.. .. ప్రోత్సాహంతో అవకాశాల్ని అందిపుచ్చుకున్న మేటి స్టార్ అతడు. మాస్ మసాలాకి కేరాఫ్ అడ్రెస్ ఈ రాజా వారు.. 1999లో 'నీకోసం' చిత్రంతో కథానాయకుడిగా కెరీర్ ప్రారంభించిన రవితే, అటుపై 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' (2001), చిరంజీవులు, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, ఖడ్గం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, నా ఆటోగ్రాఫ్, భద్ర, విక్రమార్కుడు, దుబాయ్ శీను, కృష్ణ, కిక్, డాన్ శీను, మిరపకాయ్, దరువు, బలుపు, పవర్, బెంగాళ్ టైగర్ చిత్రాలు రవితేజ కెరీర్‌లో బెస్ట్ సినిమాలుగా నిలిచాయి.
ఇటీవల కెరీర్ సంపులో పడినా .. రీబూట్ అయిన తీరు ఆసక్తికరం. 2017అతడిలో పునరుత్తేజం నింపింది. 'రాజా ది గ్రేట్' గ్రాండ్ సక్సెస్‌తో పూర్వ వైభవం అందుకున్నాడు. రీబూట్ అయ్యి తనని తాను రీ ఇన్వెంట్ చేసుకుని తిరిగొచ్చాడు. ప్రస్తుతం అతడు నటించిన 'టచ్ చేసి చూడు' రిలీజ్‌కి వస్తోంది. టీజర్‌తోనే అభిమానుల గుండెల్ని టచ్ చేశాడు. మళ్లీ హిట్టు కొట్టేట్టున్నాడు. మరో కొత్త కోణంలో చూస్తే.. మాస్ రాజా తన కుమారుడిని 'రాజా ది గ్రేట్' చిత్రంతో వెండితెరకు పరిచయం చేశాడు. మాస్ రాజా 2ని దించుతాడా? అంటూ ప్రేక్షకాభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది.

Comments
Post a Comment