ఎస్..మీరు చదివింది నిజమే. మెగాస్టార్ చిరంజీవి తనయుడు నటించనున్న కొత్త చిత్రంలో నందమూరి హీరో విలన్‌గా నటించబోతున్నాడు. ప్రస్తుతం రంగస్థలం ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చరణ్ తన తదుపరి చిత్రం బొయపాటి శ్రీనుతో ఉంటుంది. ఈ చిత్రంలో నందమూరి హీరో విలన్‌గా నటించబోతున్నాడు. ఆ హీరో ఎవరంటే తారకరత్న అని తెలుస్తుంది. ఒకేసారి తొమ్మిది సినిమాలతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఆ తరువాత ఆ జోష్‌ను అందుకోలేకపోయాడు. ఆడపాదడపా సినిమాలు చేస్తున్నా హీరో నిలదొక్కుకోలేకపోయాడు. దాదాపు ఇక హీరో ఛాన్స్‌లు లేనట్టే. ఈ నేపథ్యంలో హీరోగా సక్సెస్ సాధించిన..కనుమరుగవుతున్న సమయంలో విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి మోస్ట్ సక్సెఫుల్‌గా రాణిస్తున్న జగపతిబాబు తరహాలో ఇప్పుడు తారకరత్న ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమాకు విలన్‌గా తారకరత్నలను తీసుకుంటున్నారు. చరణ్ తో తారకరత్న ఫైట్ అంటే క్రేజీ అనే చెప్పొచ్చు. ఇక బోయపాటి సినిమాల్లో విలన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. లెజెండ్ జగపతి బాబు, సరైనోడులో ఆదికి ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు ఆ క్రమంలో తారకరత్నను కూడా విలన్ గా చూపించబోతున్నాడట.

Comments
Post a Comment