ప్రసంగ పల్లవి

60 నిమషాల్లో 60 అంశాలపై అనర్గళంగా.. ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌

అతిచిన్న వయస్సులో అరవై నిమిషాలలో అరవై సామాజిక అంశాలను అనర్గళంగా చెప్పి ప్రపంచ రికార్డును నెలకొల్పిన కె.పల్లవికి ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ తుర్లపాటి పట్టాభిరామ్‌ సర్టిఫికెట్‌ ను అందజేశారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్‌ ప్రెస్‌ క్లబ్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో గంట సేపు నిర్విరామంగా కొనసాగింది. బ్రూణహత్యలకు పాల్పడ వద్దు, నవ్వాంధ్ర నిర్మాణం ఎలా నిర్మించాలి, ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రజలను ఏ విధంగా మద్యానికి బానిసలు చేస్తుంది.. అమ్మలను ఎలా చూసుకోవాలి, మతం కులం కాదు ముఖ్యం మానవ సేవే మాధవసేవ అంటూ ఇలా చెప్పుకుంటూ అరవై సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ అనర్గళంగా చెప్పి ఈ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు పోపూరి గౌరీనాథ్‌ మాట్లాడుతూ ప్రతిభగల పిల్లలను వారి అభిరుచిని గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఒక్క విద్యతోనే అంతా సాధ్యంకాదు సామాజిక అంశాలపట్ల అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌. పట్టాభిరామ్‌ తుర్లపాటి మాట్లాడుతూ అవార్డులు చాలా మందికి వస్తాయి కాని రికార్డులు అనేవి చాలా తక్కువ మంది మాత్రమే నెలకొల్పుతుంటారని అలాంటి కోవలోకే పల్లవి చేరడం.. ఆ చిన్నారి ఆంధ్రప్రదేశ్‌ విజయవాడకు చెందడం ఎంతో గర్వకారణమన్నారు. ఇలాంటి అద్భుతమైన పిల్లల ఆశక్తిని తెలుసుకుని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించాలన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ అవార్డులకే వన్నెతెచ్చిన పల్లవిని ఏ విధంగా అభినందించాలో తెలియడంలేదని, ఇలా ఇంకా ఎన్నెన్నో రికార్డులను నెలకొల్పి మన విజయవాడకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి ఆశీర్వదించారు. అలాగే తన చదువుకు పదో తరగతి వరకూ అయ్యే ఖర్చంతా తనే భరిస్తానని హావిూ ఇచ్చారు. కమ్యూనిస్టు నాయకులు నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులో సామాజిక అంశాలపట్ల అవగాహనతో పల్లవి చెప్పడం అది ప్రపంచ రికార్డు కావడం మన విజయవాడకే గర్వకారణమన్నారు. నక్కారాములు,కోటేశ్వరమ్మ గార్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పల్లవికి ఆర్ధిక సహాయాన్ని నక్కారాజ్యలక్మి అందించారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మరీదు రామకృష్ణ, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడవిూ కార్యదర్శి గోళ్ల నారాయణరావు, మిధునం సంగీత దర్శకులు వీణాపాణి, సెయింట్‌ జాన్స్‌ స్కూల్‌ సత్యనారాయణ పురం బ్రాంచ్‌ ప్రిన్సిపాల్‌ కేవి కళ్యాణి తదితర పెద్దలు పాల్గొని ప్రసంగించి పల్లవిని ఆశీర్వదించారు. 
గతంలో పల్లవి మదర్‌ థెరిస్సా నేషనల్‌ ఫెలోషిప్‌ అవార్డు అందుకుంది. గతంలో మూడు జాతీయస్థాయి అవార్డులు అందుకుంది. ఈ రోజు అందుకునే ఈ అవార్డు ప్రపంచ రికార్డు కావడం విశేషం. మూడు జాతీయ స్థాయి అవార్డులతో పాటు చాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు రావడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నాం. మన సీఎం గారు నారా చంద్రబాబుగారితో మూడు సార్లు విజయవాడ నగరంలోనే సన్మానం అందుకునే భాగ్యం కలిగింది పల్లవికి. సామాజిక అంశాలను ప్రతిబంభిస్తూ పలు వేదికలపై కాన్సెప్ట్స్‌ చెబుతుంది.. ఈ నేపధ్యంలో తొలుత స్కోర్‌ మోర్‌ ఫౌండేషన్‌ వారు గుర్తించి జాతీయ స్థాయి అవార్డు అయిన ప్రతిభా బాల శిరోమణి అవార్డును ఇచ్చారు. అతి చిన్న వయస్సులోనే అత్యధిక వేదికలపై ప్రదర్శనలు చేసినందుకు గాను లెజెండ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులలో కూడా గత ఏడాది తన పేరు నమోదు చేసుకుంది... 
ప్రతిఒక్కరూ ఆలోచింప చేసే విధంగా సామాజిక అంశాలపై చెబుతున్న కాన్సెప్ట్స్‌ కారణంగా ఈ పురస్కారాలు లభిస్తున్నాయనేది సుస్పష్టం. సత్యనారాయణ పురం, బీఅర్టీఎస్‌ రోడ్డులోని సెయింట్‌ జాన్స్‌ స్కూలు లో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతుంది. చిన్నప్పటి నుంచీ అంటే ఎల్కేజీ లోనే సరస్వతీదేవిగా ఫ్యాన్సీడ్రస్‌ పోటీలో వేషం వేసి ''సరస్వతీ నమస్తుభ్యం'' అంటూ అందరినీ మెప్పించడమే కాకుండా ద్వితీయ స్థానం పొంది అందరినీ అబ్బురపరిచింది. అప్పుడు మొదలు పెట్టిన ప్రస్థానం తనకు అవకాశం దొరికిన ప్రతి వేదికపై గళం విప్పుతునే అందరి మన్ననలు పొందుతూ వస్తుంది. యూకేజీ చదువుతున్న. సమయంలో జెమినీ టీవీ వారు మనూ యాంకరింగ్‌ లో జరిగిన పిల్లలూ పిడుగులు ప్రోగ్రాం కి ఎంపికై 20వ ఎపిసోడ్‌ లో పాల్గొని నిజంగానే చిచ్చరపిడుగు అనిపించుకుంది. అమ్మకడుపులోనే ఆడపిల్లలను చంపొద్దూ అంటూ చెప్పిన కాన్సెప్ట్‌ యావత్‌ దేశంలో ఉన్న ప్రేక్షకులను కంటతడిపెట్టించింది. ఈ సందేశాన్ని చెప్పినందుకు గానూ జెమినీ టీవీ వారు నన్ను ఎంతగానో గౌరవించి మెచ్చుకున్నారు.2011లో స్కూలు యాజమాన్యం వారు నిర్వహించిన పాటలపోటీలో పాల్గొని ప్రధమ స్థానం పొందింది.అలాగే హైదరాబాదు శ్రీఆర్ట్స్‌ కల్చరల్‌ వారు నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త పోటీలో పాల్గొని సర్టిఫికెట్‌ సంపాదించుకున్నాను. 2012లో స్కూల్లో నిర్వహించిన పాటలపోటీలో ద్వీతీయ స్థానంలో నిలిచింది. విజయవాడ బాలభవన్‌ వారు నిర్వహించిన గాత్ర సంగీతం,భరతనాట్యం, డ్రాయింగ్‌ కాంపిటీషన్లలో పాల్గొని సర్టిఫికేట్లు పొందింది. 2013 లో విజయవాడ నగరపోలీస్‌ కమిషనరేట్‌ వారు నిర్వహించిన 67వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ట్రాఫిక్‌ రూల్స్‌ చెప్పడంతో పాటు కాన్సెప్ట్‌ చెప్పడంతో ఎంతో మంత్రముగ్ధులైన కమిషనర్‌ బి శ్రీనివాసరావు గారు పల్లవిని ఘనంగా సత్కరించారు. 2013లో స్థానిక ప్రెస్‌ క్లబ్‌ మరియు ఏపీయూడబ్లూజే వారు సంయుక్తంగా నిర్వహించిన క్రిస్టమస్‌ ఈవ్‌ కార్యక్రమంలో పాల్గొని చిత్రాచిత్రాల వాడే నా యేసయ్యా అంటూ పాడినపాట అందరినీ మెప్పించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2013లో నిర్వహించిన ఆఖరి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని కాన చెప్పి మెప్పించినందుకు గాను కాన్సెప్ట్‌ అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్‌,ఎమ్మెల్యే మల్లాది విష్ణు గార్లు నాకు ప్రభుత్వం ద్వారా 25వేల రూపాయలు మంజూరు చేయించి కలెక్టరు గారి ద్వారా ఇప్పించారు. ఘంటశాల సంగీత కళాశాలలో భక్తి ఎన్టీవీ వారు సంయుక్తంగా నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొని ఎంత మోసగాడివయ్యా శివా నీవు ఎంత వేషగాడివయ్యా శివా అంటూ పాడినపాటకు వేలాదిమంది నుంచి వచ్చిన కరతాళధ్వనులు ద్వారా ఆశీర్వచనాలు పొందింది. 2014లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన సాహిత్య నిర్ధేశ కార్యక్రమంలో పాల్గొని భారతీయ వీరులం భరతమాత బిడ్డలం అంటూ ఆలపించిన దేశభక్తి గేయం అందరినీ అలరింపచేసింది. 2014లో సినీగేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్‌ తేజా గారికి జరిగిన ఆత్మీయ సన్మాన సభలో అమ్మ ప్రేమ గురించి చెప్పిన పల్లవిని ఆయన సత్కరించడం విశేషం. అంతే కాకుండా ఏపీయూడబ్లూజే వారు వడ్డేశ్వరంలో నిర్వహించిన 34వ మహాసభలో పల్లవి చెప్పిన పలు సామాజిక అంశాలను మెచ్చుకున్న ¬ం మంత్రి చినరాజప్ప, వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరావులచేతుల విూదుగా మెమెంటో అందజేసి సత్కరించిన తీరు అమోఘమైనదే. 2015లో దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఘంటశాలలో జరిగిన నవరాత్రి వేడుకలలో పాల్గొని రోజుకో భక్తిగీతం పాడిన తీరు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారి మనసు దోచేసుకుంది.. దాంతో ఆయన సీఎం చంద్రబాబునాయుడు గారితో సన్మానం చేయించడం విశేషం. సినీనటి గీతాంజలి,నటుడు చంద్రమోహన్‌ లకు జరిగిన సన్మాన సభలో పల్లవి చెప్పిన కాన్సెప్ట్‌ వారిని సైతం కంటతడిపెట్టించింది. అలాగే డూండీ గణేష్‌ సేవా సమితి వారు 63అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటి చేసిన సందర్భంగా ఆలపించి భక్తిగీతాలు, శ్లోకాలు, సందేశాలు మెచ్చిన కోగంటి సత్యంగారు తగిన రీతిలో పల్లవిని సత్కరించారు. ప్రజానాట్యమండలి వారు నిర్వహించిన డాక్టర్‌ గరికపాటి రాజారావుగారి శతజయంతి ఉత్సవాల ముగింపు సభలో పాల్గొని అందరినీ అబ్బురపరిచే సందేశాన్ని ఇచ్చింది. సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్‌ నక్కా వీరభద్రరావుగారి నేతృత్వంలో జరిగిన మేడే 2016న నిర్వహించిన కార్యక్రమం లో కార్మికులను తాగుబోతులను చేయొద్దు పేదల బతుకుల్లో చిచ్చు పెట్టొద్దు అంటూ ప్రభుత్వానికి చేసిన హెచ్చరిక కార్మిక లోకాన్ని ఎంతో అలోచింప జేసింది. గాయిత్రీ సంఘం దేవానంద్‌ గారు 42 వ డివిజన్లో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అందరి మన్ననలు పొందింది. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీనటులు ప్రదీప్‌ గారు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని తెలుగుదనం పై చెఒ?పిన సూక్మకవిత అందరినీ అలరింప చేసింది. స్వర్గీయ సంగీత దర్శకులు ఘంటసాల వేంకటేశ్వర రావు గారి జయంతి సందర్భంగా చెప్పిన సూక్మకవిత అందరూ మెచ్చుకున్నారు. నవనిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా ఏ వన్‌ ఫంక్షన్‌ హాల్లో సీం గారు పల్లవిని సన్మానించారు. ఇటీవల సావిత్రి కళాపీఠం వారు నిర్వహించిన సావిత్రి జయంతి కార్యక్రమం లో ప్రముఖ దర్శకులు రేలంగి నృసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజా చేతుల విూదుగా మెమెంటో అందుకుంది. అలాగే షెడ్యూలు కులాల సమ్మేళనంలో చెప్పిన నవ్యాంధ్ర కాన్సెప్ట్‌ మెచ్చుకున్న సీఎం గారు మరోసారి సన్మానం చేసి మెచ్చుకున్నారు.. ప్రముఖ జానపద గాయకులు దామోదర గణపతి గారితో మేడే సందర్భంగా ఆలపించిన ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లానాని పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో పాల్గొని తనదైన శైలిని ప్రదర్శించిన తీరు అందరినీ అలరింపజేసింది. ఇలా ఇప్పటి వరకూ ఐదేళ్లలో 47 సర్టిఫికేట్లు, 27 జ్ఞాపికలు అందుకోవడం విశేషం.

Comments