చిక్ మంగళూరు : హిందూ సంఘాల వ్యాఖ్యలతో ఆవేదన చెందిన ఓ హిందూ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూరు సవిూపంలోని ముదిగేరే పట్టణంలో వెలుగుచూసింది. ముదిగేరే పట్టణానికి చెందిన ధన్య శ్రీ (20) అనే యువతి బీటెక్ చదువుతోంది. ధన్యశ్రీ స్నేహితుడైన సంతోష్ అనే యువకుడితో వాట్సాప్‌లో ఛాటింగ్ చేస్తూ కుల,మతాల గురించి మాట్లాడుతూ సరదాగా 'ఐ లవ్ ముస్లిమ్స్' అని కామెంట్ పెట్టింది. అంతే యువతి పెట్టిన మెసేజ్ ను సంతోష్ భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులకు పంపించాడు. దీనిపై హిందూ సంఘాల సభ్యులు వివిధ రకాల వ్యతిరేక వ్యాఖ్యలతో అమ్మాయిని వేధించారు. ఈ వ్యాఖ్యలతో ఆవేదన చెందిన ధన్య శ్రీ ఆత్మహత్య చేసుకుంది. ధన్య శ్రీ రాసిన సూసైడ్ నోట్ ప్రకారం వ్యాఖ్యలు చేసిన బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అనిల్ రాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ధన్య శ్రీ స్నేహితుడైన సంతోష్ పరారీలో ఉండడటంతో ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Comments
Post a Comment