ఈ ఏడాది ఢిల్లీలో అత్యంత అల్ప ఉష్ణోగ్రత 4.2 డిగ్రీల సెల్షియస్ నమోదై రికార్డు సాధించింది. దట్టంగా కమ్ముకున్న మంచుతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టమైన మంచు ప్రభావం వల్ల 22 రైళ్లను రద్దు చేశారు. మరో 8 రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. 45 రైళ్లు మంచు వల్ల ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. విమానాల రాకపోకలకు మంచు ఆటంకంగా మారింది. దీనివల్ల పలు విమానాలు ఆలస్యంగా వచ్చాయి. వణికిస్తున్న చలితో జనం అవస్థలు పడ్డారు.
హైదరాబాద్‌లో...
మధ్యాహ్నాం వేళల్లో చలి తీవ్రత పెరగడంతో నగరవాసులు గజ..గజ వణుకుతున్నారు. రెండురోజులుగా నగరంలో చలి పెరగడంతో ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు...రోడ్లపై తిరిగేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.మరో రెండురోజుల పాటు చలి తీవ్రత ఇదేస్థాయిలో కొనసాగుతుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు. కోస్తాతీరం నుంచి తూర్పుదిశగా గాలులు ఎక్కువగా వీస్తున్నాయని తెలిపారు. నగరంలో పగటిఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు కూడా నమోదుకాకపోవడంతో చలిప్రభావం ఎక్కువ ఉంటోంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని, ఆదిలాబాద్‌లో చలిగాలుల హెచ్చరికలు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం మంచు, సాయంత్రం చలిగాలుతో పార్కులు, పర్యాటకప్రాంతాల్లో పర్యాటకుల సందడి తగ్గింది.

Comments
Post a Comment