గోవాకు కూకూ..చుక్‌చుక్‌


  •  నాంపల్లి నుంచి మహబూబ్‌నగర్‌ మీదుగా వెళ్లనున్న రైలు జనవరి 5 నుంచి ప్రతి గురువారం సదుపాయం
ఇక నుంచి మహబూబ్‌నగర్‌ నుంచి పర్యటక ప్రాంతమైన గోవాకు దక్షిణమధ్య రైల్వే రైలు సదుపాయాన్ని కల్పించింది. విహార యాత్రకు గోవా వెళ్లేవారు రైలు సేవలను వినియోగించుకునేందుకు సదవకాశం కల్పించింది. ప్రతి గురువారం మహబూబ్‌నగర్‌ మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది. జనవరి 5 నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రతి గురువారం గోవాకు వారాంతపు రైలు నడపనుంది. 17021 హైదరాబాద్‌- వాస్కోడిగామ రైలు హైదరాబాద్‌ (నాంపల్లి) రైల్వే స్టేషను నుంచి ఉదయం 09.20 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్‌కు 11.57 గంటలకు చేరుకొని, ఇక్కడి నుంచి 11.58 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌, కాచిగూడ, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల, కర్నూలు, డోన్‌, గుంతకల్‌, బళ్లారి, తొరంగల్లు, ¬సపేటె, మునీరాబాద్‌, కొప్పల్‌, గదగ్‌, అన్నిగేరి, హుబ్లి, ధార్వాడ్‌, అలన్వార్‌, లోండ్‌, క్యాస్టిల్‌రాడ్‌, కుళ్లెం విూదుగా వాస్కోడిగామ (గోవా)కు మరుసటి రోజు శుక్రవారం ఉదయం 06.00 గంటలకు చేరుకుంటుంది. 
తిరుగు ప్రయాణంలో 17022 వాస్కోడిగామ - హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ అక్కడ శుక్రవారం ఉదయం 09.00 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 07.40 గంటలకు హైదరాబాద్‌ చేరుకొంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో పది బోగీలుంటాయి. ఒక ఏసీ టూటైర్‌, ఏసీ త్రీటైర్‌, మూడు స్లీపర్‌ తరగతులు, మూడు జనరల్‌ రెండో తరగతి బోగీలు, రెండు లగేజీ బోగీలుంటాయి.

Comments