ఆ సినిమాలన్నీ తీస్తా : బాలయ్య

హిందూపురం : నాన్నగారు తీయలేకపోయిన సినిమాలన్నీ నేను పూర్తి చేస్తానని స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. బాలకృష్ణ తాడేపల్లి మండలం సీతానగర్‌ విజయ కిలాద్రి పై జరుగుతున్న బ్రహ్మ్త్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..రామనుజాచార్యులు సినిమా త్వరలోనే చేయనున్నట్టు చెప్పారు. ఆధ్యాత్మిక గురువే కాక గొప్ప సంఘసంస్కర్త రామనుజాచార్యులు. వేల సంవత్సరాల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన వ్యక్తి రామనుజులు. అటువంటి వ్యక్తి చరిత్రను సినిమా తీయడం ఓ ఛాలెంజ్‌ అని అన్నారు. సంక్రాంతి సినిమాల్లో జై సింహ సూపర్‌ హిట్‌ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. నా సినిమాలు అభిమానులు మెప్పిస్తే చాలన్నారు. వారి అభిమానమే నన్ను రోజురోజుకూ యంగ్‌ హీరోలతో పోటీ పడేలా చేస్తుందన్నారు. ప్రతి సినిమాను అభిమానుల దృష్టిలో పెట్టుకుని, వారిని మెప్పించేందుకే చేస్తున్నానని...ముందు ముందు రానున్న చిత్రాలు కూడా ఆ కోవలోకే వస్తాయన్నారు. విజయకీలాద్రి బ్ర¬్మత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉంది...

Comments