బంజారాహిల్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టురట్టైంది. నిర్వాహకుడు, ఓ యువకుడు, రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఓవైఓ గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఆ గృహంపై దాడి చేశారు. నిర్వాహకుడు తమిళనాడుకు చెందిన అలెక్స్ (40)ను బిహార్‌కు చెందిన యువకుడు పంకజ్‌కుమార్ మండల్‌ను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పనిమనిషిని, యువతులను అదుపులోకి తీసుకున్నారు. యువతులను శుక్రవారం సంక్షణ గృహానికి తరలించారు. ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments
Post a Comment