సోషల్‌ మీడియాపై మూడో కన్ను


కాంట్రవర్సీ పోస్టులు పెడితే జైలుకే.. రేపటి నుంచి కొత్త చట్టం


కమ్యూనికేషన్‌ వ్యవస్థపై నిబంధనలు అమలయ్యే రోజు వచ్చేసింది. రేపటి నుంచి అంటే జనవరి 21 ఆదివారం నుంచి నిబంధనలు అమల్లో వస్తున్నాయి. మీరు వాడే మొబైల్‌ను మూడో కన్ను వాచ్‌ చేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడినా రికార్డ్‌ అయిపోతాయి. మొబైల్‌ ఏం చూసినా తెలిసిపోతుంది. చాటింగ్‌ చేసినా అంతే. అన్ని ఫోన్‌ కాల్స్‌ నమోదవుతాయి. కేంద్ర మంత్రిత్వ శాఖ వ్యవస్థ మన ఫోన్ల సంపూర్ణ రామాయణం అంతా పర్యవేక్షిస్తుంటుంది. వాట్సప్స్‌ మెసేజ్‌లు, ట్విట్టర్‌లో మాటలు.. ఫేస్‌బుక్‌ పోస్టులు ఇవన్నీ గమనిస్తుంటుంది. ఏదైనా కాంట్రవర్సీ పోస్టులు పెడితే వారెంటు లేకుండానే అరెస్టు చేసే అధికారాన్ని పోలీసులకు అప్పగించింది. ఎటువంటి అసభ్య వీడియోలు షేర్‌ చేసినా ఇక అంతే సంగతులు. ఇంతవరకూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌లో ఇష్టానుసారం వీడియోలు, పోస్టులు చేసేవారు. ఇప్పుడు వాటికి చెక్‌ పెట్టకపోతే తాట తీస్తారు. ఇటువంటి పోస్టులకు పోలీసు నోటిఫికేషన్‌ అని నామకరణం చేశారు. సైబర్‌ క్రైమ్‌ వాళ్లు , పోలీసులు వీటి మీద చర్య తీసుకుంటారు జాగ్రత్త...గ్రూపుల్లో వచ్చే మెసేజ్‌లు, వీడియోల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి.

Comments