కోడిపందాలపై హైకోర్టు సీరియస్‌

సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు ఆడుకోవచ్చు. పండగ మూడు రోజులు ఆడేసుకోవచ్చని..చట్టాలను గౌరవిస్తూనే సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి  చినరాజప్ప (గత నెల 22న ప్రకటించారు)
–––––––––––––––––––
  సంక్రాంతి సందర్భంగా ఎక్కడా కోడిపందాలు నిర్వహించకూడదు..కోడి పందాలు పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ..కోర్టు ఉత్వర్వులంటే ప్రజాప్రతినిధులకు లెక్కలేకుండాపోతోంది..ఓ జోక్‌గా తీసుకుంటున్నారు.
–హైకోర్టు సీరియస్‌

అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకటై కోడికి జై కొడుతున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలు ఓ ఉత్సవంలా నిర్వహిస్తారు. కోడిపందాల నిషేధం ఈనాటిది కాదు. అయినా గత ఏడాది కూడా కోట్లలో పందాలు నిర్వహించారు. ఎక్కడ కక్కడ అధికారులను మేనేజ్‌ చేసే నాయకులున్నారు. కోడిపందాల జోలికి పోకుండా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో అక్కడి నాయకులకు చిల్లీ చికెన్‌ తిన్నంత సులువు. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో బిగ్‌ఫైట్‌కు కోడిపుంజులు రెడీ అయ్యాయి. గత కొంత కాలంగా వేలు ఖర్చు చేసి కోడిపుంజులకు సకల సౌకర్యం కల్పిస్తూ..జీడిపప్పు..బాదం పప్పు తినిపిస్తున్నారు. కొందరైతే అప్పులు చేసి మరి కోడిపుంజులను కంటికిరెప్పలా కాపాడుకుంటూ పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడిపందాలపై హైకోర్టు  సీరియస్‌గా తీసుకుంది. ఆడినా..ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 

Comments