ర‌క్త‌దానం చేయండి

హైదరాబాద్: రక్తదానం అనేది చాలా మంచిదని, గత మూడేళ్లుగా ఇదే విషయం చెబుతూ ఆచరిస్తున్నామని మంత్రి లోకేష్ సతీమణి బ్రహ్మణి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లెజండ్రీ బ్లాక్ డొనేషన్ క్యాంప్ డ్రైవ్ రక్తదాన శిబిరం నిర్వహించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మణి మాట్లాడుతూ మన దేశంలో ఎన్ని యూనిట్ల బ్లడ్ అవసరమో... అందులో కేవలం 50 శాతం మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు. క్యాన్సర్ ఆస్పత్రిలో చిన్న పిల్లలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, వారికి సరిపడ రక్తం లేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రక్తదానం అనేది చాలా ముఖ్యమని అన్నారు. రక్తదానం చేసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఎన్టీఆర్ పేరుమీద లెజండ్రీ బ్లాక్ డొనేషన్ క్యాంప్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 120 సెంటర్లు ఉన్నాయని, దేశవ్యాప్తంగా 140 సెంటర్లు నిర్వహిస్తున్నట్లు భువనేశ్వరి చెప్పారు. ప్రతి ఒక్కరు దానం చేసే ప్రతి రక్తపు బిందువు చాలా మంది జీవితాల్లో వెలుగు ఇస్తుందని అన్నారు.

Comments