కింగ్ ఫిష‌ర్ ముద్దుగుమ్మ‌ల క్యాలెండ‌ర్ అద‌ర‌హో

కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్‌కు ఎక్క‌డ లేని క్రేజ్ ఉంది. అంద‌మైన ముద్దుగుమ్మ‌ల‌ను ఏరికోరి ఫొటో షూట్ చేసి క్యాలెండ్ పేజీల‌ను హాట్ హాట్‌గా రూపొందించ‌డంతో మ‌న్మ‌థుడు విజ‌య్‌మాల్య‌కు పెట్టింది పేరు. అందుకే ఈ క్యాలెండ‌ర్ కోసం హై ఫై లైఫ్ పీపుల్ అంతా క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తుంటారు. నిండా అప్పుల్లో మునిగిన ఆ బిజినెస్ మ‌న్ ఈ ఏడాది క్యాలెండ‌ర్ అచ్చు వేయ‌క‌పోవ‌చ్చ‌నేమోన‌ని ర‌సిక హృద‌యాలు అల్లాడిపోయాయి. అయితే వారి విర‌హ వేద‌న‌ను అర్థం చేసుకుని పెద్ద మ‌న‌సు చేసుకున్న విజ‌య‌మాల్య క్యాలెండ‌ర్ ఆపేది లేదంటూ తీపి క‌బురు అంద‌జేశాడు. విజ‌య మాల్య బికినీ క్యాలెండ‌ర్ ఈ ఏడాది మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది.  ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా మతి పోగోట్టే అందాలతో క్యాలండర్స్ మార్కెట్‌లోకి దిగిపోయాయి. క్రోషియాలోని బ్రిజ్నీలో కింగ్ ఫిషర్ 2018 క్యాలండర్ షూట్ జరిగింది. ప్రియంకా కరుణాకరన్, ప్రియంకా మూడ్లే, ఇపికా శర్మ, మిథాలీ రనోరే లాంటి మోడల్స్ ఈ హాట్ క్యాలండర్‌పై బికినీలతో మెరిసారు. ఈ క్యాలండర్‌లో చోటు దక్కించుకున్న చాలామంది భామలకు బాలీవుడ్ ఆఫర్లు దక్కుతాయనే ప్రచారం ఉంది. దీపికా పదుకునే, కత్రినా కైఫ్, ఇషా గుప్తాలాంటి భామలంతా ఒకప్పుడు కింగ్ ఫిషర్ క్యాలండర్ క్వీన్సే. మరి ఈ ఏడాది క్యాలండర్‌పై మెరిసే భామల్లో ఎవరు బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుంటారో చూడాలి.

Comments