వికీపీడియా రికార్డుల్లో బాహుబలి

ఔను.. బాహుబలి మన ఖ్యాతిని ఎక్కడెక్కడికో తీసుకుపోతోంది. ఇంతవరకూ ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ను బాహుబలి సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసిన బాహుబలి-2...ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యామాల్లో ఓ ఊపు ఊపేస్తోంది. 2017లో ఆన్‌లైన్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాగా బాహుబలి-2 రికార్డులు సృష్టించింది. ట్విట్టర్‌ సెర్చ్‌లో టాప్‌-1, నిన్న ఐఎండిబి సెర్చ్‌లో నంబర్‌ -1, గూగుల్‌ సెర్చ్‌లో నంబర్‌ -1 , ఇన్ని రికార్డులు తనపరం చేసుకుంది. తాజాగా 'బాహుబలి-2' కీర్తి కిరీటంలో మరో ఘనత వచ్చి చేరింది. ప్రపంచంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, క్వీన్‌ ఎలిజబెత్‌ గురించి సెర్చ్‌ చేసిన జనం .. 'బాహుబలి-2' గురించి అంతే గొప్పగా సెర్చ్‌ చేశారు.. అది కూడా ప్రతిష్ఠాత్మక వీకీపిడియాలో. 2017లో కోట్లాది మంది బాహుబలి-2 చరిత్ర గురించి, రికార్డుల గురించి వికీపిడియా తిరగేశారు. 
టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు, దర్శకధీర ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' గురించి ఇంగ్లీషు వికీ పీడియాలో గురించి అత్యధికులు చదివారని వికీ విూడియా ప్రకటించింది. 2017లో ప్రపంచ వ్యాప్తంగా గరిష్ఠ జనం వికీపీడియాలో చదివిన 25 ఆర్టికల్స్‌ జాబితా పరిశీలిస్తే.. 'డెత్స్‌ ఇన్‌ 2017' 3.73 కోట్ల వ్యూస్‌తో 1వ స్థానంలో నిలవగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు 2.96 కోట్ల చదువరులతో రెండో స్థానంలో ఉన్నారు. 1.92 కోట్ల వ్యూస్‌తో 'ఎలిజబెత్‌ 2' మూడో స్థానంలో నిలవగా.. 1.87 కోట్ల వ్యూస్‌తో 'గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్‌-సీజన్‌ 7' నాలుగో స్థానం సాధించింది. 1.46 కోట్ల వ్యూస్‌తో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' 11వ స్థానాన్ని అలంకరించింది. తెలుగువారంతా గర్వించదగ్గ అరుదైన ఫీట్‌ ఇది. 1700 కోట్ల వసూళ్ల సినిమాని తెరకెక్కించిన.. ప్రపంచం గుర్తించిన 'బాహుబలి-2'ని అందించిన జక్కన్నకు మరోసారి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

Comments