అభిమానుల మధ్య చిచ్చుపెడుతున్నదెవరు?



  • జై లవ కుశకు  నో ప్రిమియర్‌ షో
  • అజ్ఙాతవాసికి ఎన్నైనా ఓకే

నిజం చెప్పాలంటే..నిజం చెప్పాలంటే..సర్కారే. హీరోలంతా చేయి చేయి కలుపుకుని సందర్భం వచ్చినప్పుడల్లా మేమంతా ఒక్కటేనని చెబుతుంటారు. ఇటీవల త్రివిక్రమ్‌..ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ప్రార ంభం కానున్న చిత్రానికి స్వయంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కొబ్బరి కాయ కొట్టి బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. పవన్‌..మహేష్‌ కూడా మంచి మిత్రులే. ఇలా ఇండస్ట్రీలో పెద్ద హీరోలంతా, చిన్న హీరోలంతా ఐక్యంగానే ఉంటున్నారు. మరి అభిమానుల్లో తేడా ఎందుకొస్తుంది? హీరోల్లాగా అభిమానులు ఉండొచ్చు కదా...ఎవరి హీరో సినిమా విడుదలయితే ఆ హీరో అభిమానులు పండగ చేసుకోవచ్చు కదా...వాళ్ల పోస్టర్లు వీళ్లు చింపడం..వీళ్ల సినిమాపై వేరే హీరో అభిమానులు తప్పుడు ప్రచారం చేయడం ఎందుకు? సరే అభిమానులు...ప్రాణమించేవాళ్లూ ఉన్నారు..ఒక్కో సందర్భంలో ప్రాణం తీసేవారూ ఉన్నారు. అభిమానులు రెచ్చగొట్టే ధోరణి ఒక్కోసారి సర్కారే పూనుకుంటుందా? అంటే అజ్ఙాతవాసి సాక్షిగా ఔననే సమాధాన వస్తుంది. ఎందుకంటే ఎన్టీ ఆర్‌ నటించి, ప్రతిష్టాత్మక చిత్రం జై లవ కుశ చిత్రానికి ప్రీమియర్‌ షోలు వేసుకునేందుకు అవకాశం ఇమ్మని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం నో అంది. అంతకు ముందు రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇమ్మంటే నోరు మెదపలేదు. బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం పన్నుమినహాయింపు ఇచ్చారు. ఇలా ఒక హీరోకు ఫేవర్‌ చేస్తూ మరో హీరో సినిమాను పట్టించుకోకపోవడం వివాదాలకు దారితీస్తోంది. ఇటీవల నంది అవార్డుల విషయంలోనూ ఇలాగే జరిగింది. రుద్రమదేవి లాంటి గొప్ప చిత్రం తీసినందుకు క్షమించమని దర్శకుడు గుణశేఖర్‌ మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా అజ్ఙాతవాసి చిత్రానికి నచ్చిన విధంగా ప్రీమియర్‌ షోలు వేసుకునే అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల చంద్రులు ఓకే చెప్పేశారు. ఔను మరి ఆంధ్రలో పవన్‌ మద్దతు టీడీపీకి అవసరం... తెలంగాణలో కూడా కేసీఆర్‌ను మంచి చేసుకున్నాడు పవన్‌...ఇటీవల కలసి రెండుగంటలపాటు మనసువిప్పి మాట్లాడుకున్నారు కూడా. కలిసి డిన్నర్‌ చేశారు కూడా. సినిమాలపై మంచి ఆసక్తి ఉన్న కేసీఆర్‌ అజ్ఙాతవాసి చిత్రం కోసం పవన్‌ను చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాడట. తప్పకుండా ఈ చిత్రం చూస్తానని పవన్‌కు హామీ కూడా ఇచ్చాటడ. మరి ఇంత జరిగిన తరువాత అజ్ఞాత వాసికి ఆ మాత్రం ఫేవర్‌ చేయకపోతే ఎలా? అందుకే మీ చిత్రం ..మీ డబ్బులు..ప్రేక్షకుల కష్టార్జితం..ప్రిమియర్‌ షోలు వేసుకోండి..వేసేసుకోండి.. అంటు చంద్రులిద్దరూ ఆర్డర్లు ఇచ్చేశారు. 

Comments