ప్రీమియర్‌ దోపిడీ

వడ్డించేవాడు మనవాడైతే ఎన్ని ప్రీమియర్‌ షోలైనా వేసుకోవచ్చు. కేవలం పవర్‌ స్టార్‌కు భయపడో..లేక ఇంకాస్త ఫెవికల్‌ బంధం పెంచుకోవడానికో..ప్యాకేజీలో భాగమో..ఏదైనా కావొచ్చు... సర్కారు సినిమా పండుగకు ఏర్పాట్లు చేసింది. ఇది సినిమావాళ్లందరూ చేసుకునే పండగ కాదొండోయ్‌. అజ్ఙాతవాసి లాంటి వాళ్లకు మాత్రమే. రేపు జై సింహ లాంటి వాళ్ల కోసమూ కావొచ్చు.. అంతే..అంతెంతే...!! ఇంత దుర్మార్గంగా 24 గంటలూ సినిమా వేసుకుని టికెట్ల ధర పెంచుకుని జనం జేబులు కొల్లగొట్టి..వినోదాన్ని విచ్చలవిడిగా అమ్ముకుంటున్న ఓ అజ్ఙాతవాసీ ఇది సరైనదేనా...ప్రశ్నించు?
ఇంతకుముందు ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఎవరికైనా ఇలా రెడ్‌ కార్పెట్‌ పరిచారా? కోట్లు పెట్టిన సినిమా తేడా వస్తే ఇక అంతే సంగతులు. అందుకే విడుదలైన రెండు మూడు రోజులు...అంతకుమించి విడుదలైన రోజే టికెట్‌ ధరలు అమాంతం పెంచేసుకుని ప్రీమియర్‌ దోపిడీకి పాల్పడడం ఎంతవరకు సమంజసం...బాబూలు ప్రశ్నించండి?.. తన సినిమాకు ప్రీమియర్‌ షోలకు అనుమతి ఇవ్వకపోతే వాళ్లను ఎండగడతాడని భయం. అందుకే అధికారికంగా అనుమతులు మంజూరు చేసేశారు. తెరమీద పవర్‌స్టార్‌ అయితేతెర వెనుక కల్యాణ్‌బాబుల స్క్రీన్‌ ప్లే అదుర్స్‌ కదా...వాళ్లష్టం...వాళ్లు చెప్పిందే సినిమా..చూపించిందే వినోదం..సర్కారుదే పండగ సంబరం...
   ఇక్కడ సర్కారు అనుమతులు మంజూరు చేస్తే..తెలంగాణలో మాత్రం ఆ స్టార్‌ పప్పులుడకలేదు. నిజంగా కేసీఆర్‌ మగడ్రా బుజ్జీ... 

Comments