నాగుగేళ్లలో టెస్ట్‌ ట్యూబ్‌ చికెన్‌

ఇంతవరకూ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ గురించి విన్నారు. ఇదేంటి టెస్ట్‌ ట్యూబ్‌ చికెన్‌ అంటున్నారు..? అదేగా మీ డౌటు. నిజమేనండి. త్వరలో టెస్ట్‌ ట్యూబ్‌ చికెన్‌.. మన ఫుడ్‌ మెనూలోకి చేరనున్నది. పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. చికెన్‌ నుంచి కణాలు సేకరించి టెస్ట్‌ ట్యూబ్‌ చికెన్‌ తయారుచేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు పరిశోధకులు. టెల్‌ అవివ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ అమిత్‌ గెఫెన్‌ ఇప్పటికే లాబొరేటరీలో చికెన్‌ కణాలతో ఈ ప్రయోగం చేస్తున్నాడు. మోడ్రన్‌ అగ్రి కల్చర్‌ ద్వారా చికెన్‌ కణాల్లో దీన్ని తయారు చేసేందుకు కూడా ప్లాన్‌ చేస్తున్నారట. రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ తరహా చికెన్‌ సూపర్‌ మార్కెట్లలోకి రానున్నది. మొత్తం విూద లెక్కకు మించి జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో నాన్‌ వెజ్‌ రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక టెస్ట్‌ ట్యూబ్‌ ఫుడ్డే దిక్కు. టెస్ట్‌ ట్యూబ్‌ హాంబర్గర్స్‌ వరల్డ్‌ మార్కెట్లో ఆదరణ పొందిన క్రమంలో చికెన్‌ కు కూడా ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకసారి టెస్ట్‌ ట్యూబ్‌ చికెన్‌ మార్కెట్లోకి వచ్చిందంటే పౌల్ట్రీల దగ్గర, చికెన్‌ షాపుల దగ్గర వెయిట్‌ చేసే అవసరం ఉండబోదేమో.

Comments