Skip to main content
సిగరెట్ల తయారీ ఆపేస్తున్నాం..
పీఎంఐ ప్రకటన
లండన్: ఇకపై క్రమంగా సిగరెట్ల తయారీ నిలివేయనున్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ పొగాకు ఉత్పత్తుల కంపెనీ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ (పీఎంఐ) ప్రకటించింది. తొలుత బ్రిటన్‌లో సిగరెట్ల అమ్మకాన్ని నిలిపివేసి... వాటి స్థానంలో పొగ రహిత ఈ-సిగరెట్లను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ తయారు చేసే మోర్ల్‌బోరో సిగరెట్ బ్రాండుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. అమెరికా సహా దాదాపు 180కి పైగా దేశాల్లో పీఎంఐ సిగరెట్ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. కాగా సిగరెట్లు మానివేయాలంటూ బ్రిటన్‌లోని వినియోగదారులను ప్రోత్సహించేలా ఫిలిప్ మోరిస్ ఓ వెబ్‌సైట్ కూడా ప్రారంభించడం విశేషం.
Comments
Post a Comment