హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల సమాచారం ఇస్తే రూ.1000 నజరానా ఇస్తామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన ఆనందాశ్రమానికి స్పందన బాగుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బిచ్చాగాళ్లే కనిపించడం లేదని తెలిపారు. అందుకే రివార్డును రూ.500 నుంచి రూ.1000కి పెంచామని వివరించారు. భాగ్యనగరాన్ని యాచకులులేని నగరంగా తయారు చేయడానికి జైళ్ల శాఖ కృషి చేస్తోందని తెలిపారు.

Comments
Post a Comment