మహిళలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే వాళ్ల కళ్లు మీ వ్యక్తిత్వాన్ని పసిగట్టగలవు. ఇప్పటి మహిళలు కంటి చూపుతో అవతలి వ్యక్తి ఎలాంటివారో పసిగడతారట. పైకి ఒకలా కనిపిస్తారు. లోపల ఉద్దేశం వేరే ఉంటుంది. చూడటానికి నవ్వుతూ.. నవ్విస్తూ ఉంటారు. ఏవోవే చెప్పి నమ్మిస్తుంటారు. ఆడవాళ్లే కదా అని మోసం చేసేస్తుంటారు. కానీ ఇవన్నీ చూస్తూ మహిళలు మాత్రం ఊరికే ఉంటారనుకుంటే పప్పులో కాలేసినట్లే అంటున్నారు పరిశోధకులు. మనసులో దురుద్దేశం పెట్టుకుని నవ్వుతూ మహిళలన్ని చూసినా వారి వక్రబుద్ధిని అతి సులువుగా తెలుసుకుంటారట మహిళలు. మగవారి మాటలను కంటిచూపుతో తేల్చేస్తారట. కేమ్‌బ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో ఈ విషయం నిర్ధారణకు వచ్చిందని పరిశోధకులు చెప్తున్నారు. సమాజాన్ని అతి నిశితంగా పరిశీలించడం, రోజువారీ సంఘటనల ఆధారంగా చూపుతో పసిగట్టే శక్తిని పెంపొందిచుకుంటున్నట్లు వారి అధ్యయనంలో వెల్లడైంది. చూపు ఆధారంగా ఆలోచనల్ని పసిగట్టవచ్చా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా 89 వేల మందిపై ఈ సర్వే నిర్వహించగా ఇందులో దాదాపు సగానికిపైగా ఎదుటివారి ఆలోచనల్ని సులువుగా కనిపెట్టేశారని తెలిసింది. మహిళలకి ఆ శక్తి చిన్నప్పటి నుంచే వయసుతో పాటు పెరుగుతూ వస్తున్నదని పరిశోధకులు ధ్రువీకరించారు. కాబట్టి మహిళలతో మాట్లాడేటప్పుడు మాటలే కాదు.. చూపులు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Comments
Post a Comment