ఆర్జీవితో కలిసి పనిచేస్తా

అమెరికన్‌ పోర్న్‌ స్టార్‌ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైరక్టర్‌ ఆర్జీవి తెరకెక్కించిన 'గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' (జీఎస్టీ). పై వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. జీఎస్టీపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. స్త్రీ మనోభావాలు దెబ్బతీసేలా డైరెక్టర్‌ ఆర్జీవీ తెరకెక్కించాడంటూ కొన్ని చోట్ల దిష్టబొమ్మ దహనం చేశారు. ఈనేపథ్యంలో జీఎస్టీ-2లో తాను యాక్ట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ శృంగార తార షకీలా చెప్పుకొచ్చింది. వర్మ జీఎస్టీ -2 లో యాక్ట్‌ చేయమంటే చేస్తా. కానీ బరువు తగ్గమంటే చెప్పలేనంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది ఆమె. మహిళా సంఘాలు వ్యతిరేకతపై ..మహిళా సంఘాలకు పనీపాట ఏముండదు. కాలేజ్‌ స్టూడెంట్స్‌, ఐటీ ఉద్యోగినులు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో వాళ్లకు తెలుసా..? తెలుసుకొని ప్రశ్నించారా అంటూ మండిపడింది. సినిమాను సినిమా చూడాలే తప్పా. సినిమాలు విడుదల ఆపేయండి అంటూ మహిళా సంఘాలు ఎక్కువ చేస్తున్నాయంటూ కౌంటర్‌ అటాక్‌ ఇచ్చింది. ఇక షకీిలా వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి. సమాజానికి మంచి చేసే సినిమాలని ప్రోత్సహిస్తామని , అలా అని యువత పెడదోవ పట్టించే సినిమాల్ని వ్యతిరేకిస్తామని అంటున్నాయి. మరి షకీలా ఇంట్రస్ట్‌ పై క్రియేటీవ్‌ డైరక్టర్‌ ఆర్జీవీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Comments