పీకే...త్రివిక్రమ్‌..ఓ అజ్ఞాతవాసి


తివిక్రమ్‌.. 

టాలీవుడ్‌ సెల్యూలాడ్‌పై ఓ అద్భుత దర్శకుడు..ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి..మనసును హత్తుకుంటాయి..కన్నీళ్లు రప్పిస్తాయి..హాయిగా నవ్విస్తాయి..సమాజాన్ని ప్రశ్నిస్తాయి...కథ ఏమీ ఉండదు..కథనం మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలు గుర్తుకు తెస్తుంటాయి. అందుకేనేమో ఆయన చిత్రాలు చాలా స్పెషల్‌..ఓ గొప్ప దర్శకుడు లభించాడని తెలుగు ప్రేక్షకులు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. ఆయన కలం కూడా మనసుపెట్టి రాస్తుంది. ఎన్నో జీవితాలను సిరాగా మార్చుకుని సగటు ప్రేక్షకుడ్ని అలరిస్తాయి. 

వపన్‌.. 

ఇతనో ఎవరికీ అర్థంకాని నటుడు. ఆవేశాలు..ఆలోచనలు..చాలాచాలా వెరైటీ. ఎవర్ని ఎందుకు నమ్ముతాడో..ఎవర్ని ఎందుకు అభిమానిస్తాడో...ఎందుకు ప్రేమిస్తాడో..అన్ని అతనితో కనెక్ట్‌ అయినావాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఆయనతో స్నేహం చేసిన వాళ్లు పవన్‌తో ఉండిపోవాలని అనుకుంటారు. అన్న మెగాస్టార్‌ ఇమేజ్‌తో వెండితెరకు పరిచయం అయినా తన సొంత మేనరిజంతో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆకట్టుకోవడమే కాదు పవర్‌స్టార్‌గా ఎదిగిపోయాడు. ఎన్ని అపజయాలు ఎదురైనా పవన్‌ సినిమా వస్తుందంటే ఆ కిక్కే వేరు. ఆ సందడే వేరు. అపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను హై రేంజ్‌లో తీసుకువెళ్లగలిగే సత్తా ఉన్న స్టార్‌ హీరో.. 

ఇద్దరూ అలా కలిసారు.. 
ఆయన మాటల మాంత్రికుడు..ఈయన పవర్‌స్టార్‌.. ఈ ఇద్దరు చాలా ఏళ్ల తరువాత జల్సాతో కలుసుకున్నారు. సినిమాలో ఏం లేదు.. కానీ సూపర్‌ హిట్‌..బయట పడటం లోనే పడటం ఉంది మనం పడద్దు లెగుద్దాం... 
ఆశ కాన్సర్‌ ఉన్నవాడిని కూడా బతికిస్తుంది.. భయం అల్సెర్‌ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది...నీకే తల నొప్పి తెస్తున్నాడంటే వాడెవడో అమృతాంజనమ్‌ అమ్మ మొగుడై ఉంటాడు. వంటి డైలాగ్‌ విని ప్రేక్షకులు జల్సా చేసుకున్నారు. ఇక అంతే తిరిగి చూసుకోలేదు. ఇద్దరి మధ్య స్నేహగీతం చిగురించింది. ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటున్నా..అన్ని విషయాలు ఇద్దరూ చర్చించుకునే స్థాయిలోలో వీరి బంధం బలపడింది. చాలా రోజుల తరువాత అత్తారింటికి దారేది అంటూ ఇద్దరూ వచ్చారు. సినిమా విడుదలకు ముందే సగం సినిమా పైరసీ అయినా కథలో సత్తా ఉంది..కథనంలో డెప్త్‌ ఉండటంతో టాలీవుడ్‌ రికార్డులన్నీ తుడిచి పెట్టేశారు. అది పవన్‌ క్రేజ్‌...అదీ త్రివిక్రమ్‌ రేంజ్‌.... 
మళ్లీ ఎవరి సినిమాలు వారివే. ఎవరి లోకం వారిదే. కానీ మాట..బాట ఒకటే. అందుకే మళ్లీ ఇద్దరూ కలిసి అజ్ఞాతవాసికి శ్రీకారం చుట్టారు. కానీ ఈసారి త్రివిక్రమ్‌ మాటలకు చింతకాయలు రాలలేదు. పవన్‌ ఇమేజ్‌ ఓపెనింగ్స్‌ తెచ్చాయి... అయితే ఈ సినిమా పవన్‌కు ఏ రకంగా కలిసొచ్చేది కాదు. పవన్‌ను ఎలా ఒప్పించాడో త్రివిక్రమ్‌కే తెలియాలి. ఏముందని ఒప్పుకున్నాడో పవర్‌స్టారే చెప్పాలి. 
త్రివిక్రమ్‌ కూడా మామాలు దర్శకుడేనని ఈ సినిమా రుజువు చేసింది. మూస కథలవైపే పయనిస్తాడా? అన్న అనుమానం క్రియేట్‌ చేసినట్టయింది. ఏదేమైనా ఇది త్రివిక్రమ్‌ స్టైల్‌ కాదు..పవన్‌స్టార్‌ నటించే సినిమా కూడా కాదు. ఎక్కడో మిస్‌ఫైర్‌ అయింది. అజ్ఞాతవాసిని చూసి అభిమానులు గొప్పగా చెప్పుకోవచ్చు..అభిమానులు కనుక..సగటు ప్రేక్షకుడికి మాత్రం నిరాశే.

Comments