కథానాయికల మధ్య కోల్డ్ వార్ నిరంతరం హాట్ టాపిక్. పోటీ ప్రపంచంలో ఎంత స్నేహంగా ఉందామన్నా.. ఇగో కొన్నిటికి అడ్డొస్తుంటుంది. ఇదో వింత సెలబ్ ప్రపంచం. వివాదాలతో చెలిమి చేసే ఫేజ్-3 వరల్డ్. తమ ప్రమేయం లేకుండానే శత్రువులు తయారవుతుంటారు. అదే కోవలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దీపిక పదుకొన్, కత్రిన కైఫ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉందన్న ప్రచారం సాగింది. ఆ ఇద్దరూ కెరీర్ ఆరంభమే రణబీర్‌తో ప్రేమాయణం నడిపించారు. ఒకరి వల్ల ఇంకొకరు ఇబ్బందుల పాలయ్యారు. ఆ క్రమంలోనే ఇరువురి మధ్యా క్లాషెస్ షురూ అయ్యాయి. అయితే ప్రస్తుతం రణబీర్ ఆ ఇద్దరితో ఎఫైర్‌ని ముగించి కొత్త లవర్‌ని వెతుక్కున్న సంగతి విధితమే. ఇదంతా ఇటుంచితే పలు సందర్భాల్లో దీపిక ? కత్రిన మధ్య గొడవలు బహిరంగం అయ్యాయి. కానీ అదమీ పట్టనట్టు పలు సందర్భాల్లో ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు అరుదుగా ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'రాబ్తా'లో దీపిక స్పెషల్ సాంగ్ గురించి కత్రినను ప్రశ్నిస్తే .. ఆ పాట అంటే తనకు ఎంతో ఇష్టమని, అందులో దీపిక చాలా అందంగా కనిపించిందని ప్రశంసించింది. ఆ తర్వాత 2017 కేన్స్ ఉత్సవాల్లో కత్రిన పొగడ్త గురించి దీపికను ప్రశ్నిస్తే, ''తోటి నటీమణి ప్రశంసించడం గొప్పగా భావిస్తాను. కత్రిన తన కెరీర్‌ని మలుచుకున్న తీరు నన్నెంతో ఆకట్టుకుంది'' అని పొగిడేసింది. ఇక మొన్నటికి మొన్న 'వోగ్' ప్రచార కార్యక్రమాల్లో దీపికను నేహా ధూపియా ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీ పెళ్లికి కత్రినను ఆహ్వానిస్తారా? అన్న ప్రశ్నకు 'నో' అంటూ సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చింది దీపిక. అయినా రణవీర్ సింగ్‌ని పెళ్లాడుతున్న దీపికకు కత్రినను ఆహ్వానించడానికి అభ్యంతరమేంటి? పెళ్లాడబోయేది రణబీర్‌ని కాదు కదా? రీసెంటుగా అనుష్క శర్మ పెళ్లికి తన విరోధి అయిన సల్మాన్‌ని ఆహ్వానించని సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

Comments
Post a Comment