'పద్మావత్‌' కాసుల వర్షం

'పద్మావత్‌' ఇంటా బయటా రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమా వివాదాల కారణంగా నాలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రిలీజ్‌ కాని సంగతి తెలిసిందే. అయినా స్వదేశంలో చక్కని వసూళ్లు సాధిస్తోంది. ఇక ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమాకి అడ్డూ ఆపూ లేదని ప్రూవైంది. అమెరికా, కెనడా నుంచి పద్మావత్‌ అద్భుత వసూళ్లు సాధిస్తోందని ట్రేడ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. ఇక ఇప్పటివరకూ ఓవర్సీస్‌లో ఉన్న అన్ని రికార్డుల్ని ఈ సినిమా బ్రేక్‌ చేసిందని బాక్సాఫీస్‌ ఇండియా డాట్‌ కాం పేర్కొంది. ఓవర్సీస్‌లో 3డి, ఐమ్యాక్స్‌ 3డి లో రిలీజవ్వడం పెద్ద రేంజులో కలిసొచ్చిందని విశ్లేషించింది. పద్మావత్‌ చిత్రం ఓవర్సీస్‌ (అమెరికా, కెనడా)లో 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరబోతోంది. ఇప్పటికే 3రోజుల్లో 74కోట్లు వసూలు చేసింది. డాలర్లలో పరిశీలిస్తే.. 11.60 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు వసూలైందని ట్రేడ్‌ వెల్లడించింది. ఓవర్సీస్‌లో తొలి మూడు రోజుల్లో అవిూర్‌ఖాన్‌ ధూమ్‌ 3 -10.59 మిలియన్‌ డాలర్లు, సుల్తాన్‌ -9.45 మిలియన్‌ డాలర్లు, దిల్‌ వాలే-8.52 మిలియన్‌ డాలర్లు, భజరంగి భాయిజాన్‌ -8.12 డాలర్లు వసూలు చేశాయి. పద్మావత్‌ ఈ రికార్డులన్నీ అధిగమించింది. ఓ రకంగా ఓవర్సీస్‌లో ఖాన్‌ల రికార్డులన్నీ భన్సాలీ తిరగరాశాడన్నమాట!

Comments