క్యూ లైన్‌లో బ్లేడుతో కోసి హత్య

వేములవాడ రాజన్న ఆలయం వద్ద కలకలం రేగింది. క్యూ లైన్‌లో ఉన్న వ్యక్తిపై హఠాత్తుగా దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మెడపై, తలపై బ్లేడ్‌తో విచక్షణా రహితంగా కోసి హత్య చేశారు. మెదక్‌ జిల్లా ఘనపూర్‌కు చెందిన బండి బాలయ్య (37)గా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదు. పాత కక్షలు కారణంగానే హత్య జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Comments