Skip to main content
సల్మాన్ 'రేసు'లో గ్యాంగ్ స్టర్ గ్యాంగ్
షూటింగ్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయిన సల్మాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ విష్ణోయ్ అనే గ్యాంగ్ స్టర్ బెదిరించిన సంగతి తెలిసిందే. కృష్ణ జింకల కేసులో విచారణకు హాజరయ్యేందుకు జోద్‌పూర్ కోర్టుకు వెళ్లిన సల్మాన్ ఖాన్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలిసిందే. అయితే తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రేస్ 3 షూటింగ్ పరిసర ప్రాంతాలలో సంచరించడం చిత్ర యూనిట్ గుర్తించినట్టు సమాచారం. దీంతో యూనిట్ వెంటనే పోలీసులకి సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని సల్మాన్‌ని, చిత్ర నిర్మాత రమేష్ తౌరానిని ఎస్కార్ట్ వాహనంలో సల్మాన్ ఇంటికి తరలించారు. షూటింగ్ మధ్యలోనే సల్మాన్ తన ఇంటికి వెళ్ళగా, అతని కారుని కొందరు పోలీసులు సల్మాన్ ఇంటికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. త్వరలో జరగనున్న షెడ్యూల్ కోసం సల్మాన్‌కి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని పోలీసులు అంటున్నారట. రేస్ 3 చిత్రంలో సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించనుండగా, అనీల్ కపూర్, డైసీ షా, బాబీ డియోల్, సాఖీబ్ సలీమ్ , ఫ్రీడీ దరువాలాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు . ఈ ఏడాది ఈద్ కానుకగా మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రేస్ 3 చిత్రం గుర్గావ్ లోని ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో సూపర్ హిట్ సిరీస్ .. రేస్ లో వచ్చిన రెండు సీక్వెల్స్ మంచి విజయం సాధించడంతో రేస్ 3పై కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రెమో డిసౌజా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.
Comments
Post a Comment