నినాదాలు ఇచ్చినంత తేలిగ్గా నిర్ణయాలు అమలు కావు. కానీ దక్షిణాఫ్రికాలో ఒక నినాదం మాత్రం అక్కడి అమ్మాయిల జీవితాల్నే మార్చేసింది. ఎంతోమంది అమ్మాయిలు ఇప్పుడక్కడ ఉన్నత చదువులు చదువుతూ మగవారికీ ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇంతకీ ఆ నినాదం ఏంటో తెలుసా? యుక్తవయస్సు గర్భధారణ, విజృంభిస్తున్న హెచ్‌ఐవి, ఎయిడ్స్ వంటి సమస్యలను అదుపు చేయడానికి ఇంతకంటే వేరేమార్గం కనపించలేదు మరి. ఆ నినాదాన్ని అనుసరించి అక్కడి అమ్మాయిలు ఎంతకాలం కన్యలుగా ఉంటారో అంతకాలం వారి చదువులకు అవసరమైన స్కాలర్‌షిప్పులను అందజేస్తున్నారు అక్కడి పాలకులు. ఇదంతా దక్షిణాఫ్రికాలోని డర్బన్‌కు 200 కి.మీ. దూరంలో ఉన్న ఉథుకేలా అనే జిల్లాలో జరిగింది. అధికారులు తీసుకున్న నిర్ణయం అక్కడి అమ్మాయిలకు ఎంతగానో ఉపయోగపడింది. ఉథుకేలా జిల్లాలోని అమ్మాయిలు ఇప్పుడు తమకు సాధ్యంకాని ఉన్నత చదువులను అభ్యసిస్తున్నారు. బర్సరీ అనే పేరుతో ఇస్తున్న ఈ స్కాలర్‌షిప్స్ వారి జీవితాలను మార్చేస్తున్నాయి. సంవత్సరానికి కొన్నివేల డాలర్లను గ్రాంట్స్ రూపంలో మంజూరు చేస్తున్నారు. పేదరికం కారణంగా చదువుని మధ్యలో ఆపేసి పనులు చేసుకుని బతుకుతున్న అమ్మాయిల జీవితాల్లో ఈ స్కాలర్‌షిప్స్ చాలా మార్పులు తెచ్చాయి. పేదరికం కారణంగా యూనివర్శిటీ చదువుని ఆపేసిన ఓ విద్యార్థిని తన చదువుకోసం 32 ఏళ్ల వయసు వచ్చినా కన్యగానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా, ఎంత శాతం మార్కులు వచ్చాయి అనే విషయాన్ని కూడా చూడకుండా ఈ స్కాలర్‌షిప్స్‌ను మంజూరు చేస్తున్నారు.అయితే వీటిని మంజూరు చేసే ముందు పెద్దవయసున్న మహిళలు నిర్వహించే కన్యత్వ పరీక్షలకు వారు సిద్ధం కావాలి. ఇప్పటివరకు 16మంది యువతులు ఈ విధంగా లబ్ది పొందుతున్నారు. మానవహక్కుల ఉద్యమకారులు దీనిపై మండిపడుతున్నారు. ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అని వారు భావిస్తున్నారు. ఈ విధానం మహిళా హక్కులను హరించి వేస్తుందని, ఇది పితృస్వామ్య భావజాలపు ఆలోచన అని మహిళా హక్కుల ఉద్యమకారులు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఉథుకేలా అధికారులు మాత్రం ఇవేవిూ పట్టించుకోవడం లేదు.
తమ జిల్లాలో టీనేజి గర్భధారణలు హెచ్చుగా ఉండటం, హెచ్‌ఐవికి గురైనవారు అధికంగా ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉథుకేలా మహిళా మేయర్ డుడు మజిబుకో అంటున్నారు. దక్షిణాఫ్రికాలో 25శాతం మంది అమ్మాయిలు 19ఏళ్లకే గర్భం దాలుస్తున్నారు. అమ్మాయిలు కూడా ఈ పరీక్షలను అవమానకరంగా భావించడం లేదు. ఇందులో ఎలాంటి అవమానం, బాధ లేదని వారు చెబుతున్నారు.ఇలాంటి స్కాలర్‌షిప్స్ మగపిల్లలకు కూడా ఇవ్వాలనేది మేయర్ డుడు మజిబుకో ఆలోచన. అయితే వారికి ఎలాంటి పరీక్షలతో బ్రహ్మచర్యాన్ని పరీక్షిస్తారో ఆమె వెల్లడించలేదు. బర్సరీ పథకాన్ని విమర్శించేవారు హెచ్‌ఐవి ఎయిడ్స్‌ను అరికట్టడానికి మరేదైనా పథకం చెప్పాలని మజిబుకో అంటున్నారు.

చాలా కొత్త ఆలోచన
ReplyDelete