ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) విద్యార్థులు విద్యుత్‌తో స్వతంత్రంగా నడిచే ఈ-రిక్షాలను రూపొందిస్తున్నారు. నగరాల్లోని మెట్రో వంటి ప్రజారవాణా వ్యవస్థకు అనుబంధంగా వీటిని నడుపనున్నట్టు చెప్తున్నారు. సెంటర్ సిబ్బందితోపాటు ఐఐఐటీ ప్రొఫెసర్లు, పీహెచ్‌డీ విద్యార్థులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, 3డీ మ్యాప్‌ల ద్వారా మార్గాన్ని నిర్దేశించుకునేలా వీటిని రూపొందిస్తున్నామని సెంటర్ హెడ్ మయాంక్ వత్స తెలిపారు. 2016లో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని త్వరలోనే క్యాంపస్‌లో డ్రైవర్ రహిత ఈ-రిక్షాలను పరుగులు పెట్టిస్తామన్నారు

Comments
Post a Comment