న్యూయార్క్: కొత్తఏడాదిలో జన్మనివ్వడం ఏ తల్లికైనా వింతే. నూతన సంవత్సరం రోజు సోమవారం ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది పుట్టారో తెలుసా? అందులో భారత దేశ స్థానమెంతో వింటే షాకవుతారు. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) రిపోర్టు ప్రకారం 2018, జనవరి 1న మొత్తం 3 లక్షల 86 వేల మంది జన్మించినట్లు పేర్కొంది. అంతేగాక ఇండియాలోనే ఎక్కువ మంది జన్మించారట. మన దేశంలో మొత్తం 69,070 మంది జన్మించినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. మన తరువాతి స్థానాల్లో చైనా(44,760), నైజీరియా(20,210), పాకిస్థాన్(14,910), ఇండోనేషియా(13,370), అమెరికా(11,280), కాంగో(9,400), బంగ్లాదేశ్(8370) ఉన్నాయి. కాగా, ఈ చిన్నారుల్లో కొంత మంది మొదటి రోజే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Comments
Post a Comment