ఒక్క సినిమాకు పది కోట్లు

ఐశ్వర్య అందానికి రెమ్యునరేషన్‌ ఎంత ఇచ్చినా తక్కువే. అందుకే ఐస్‌ తాజా సినిమాకు ఏకంగా పది కోట్లు డిమాండ్‌ చేస్తోంది. అమ్మడు డిమాండ్‌ సరైనదేనని నిర్మాతలు కూడా అంగీకరించడం కొసమెరుపు. పది కోట్లు తీసుకుంటూ మూడు పదుల వయసు భామ ఐశ్వర్య మరోసారి అందరి దృష్టిలో పడింది. 2015లో 'జజ్బా' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్యారాయ్‌. అంతవరకూ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ ఆలనాపాలనతోనే సరిపోయింది. ఆరాధ్య ఎదిగేసింది కాబట్టి కెరీర్‌ పరంగా ఎలాంటి అడ్డంకులు లేవిక. బిగ్‌బి, బుల్లిబిల నుంచి కావాల్సినంత ప్రోత్సాహం ఉంది. జజ్బా, షరబ్‌జిత్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించాయి. 'ఏ దిల్‌ హై ముష్కిల్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌. ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం సన్నాహకాల్లో ఉంది ఐష్‌. ఆ క్రమంలోనే నర్గీస్‌ దత్‌ నటించిన క్లాసిక్‌ 'ది రాత్‌ ఔర్‌ దిన్‌'(1967) చిత్రం రీమేక్‌లో ఐష్‌ నటిస్తున్నారని, ద్విపాత్రాభినయం చేయనున్నారని ప్రచారమైంది. క్రిఅర్జ్‌ బ్యానర్‌లో కృతి అరోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంజయ్‌దత్‌ తల్లి, మేటి కథానాయిక నర్గీస్‌ సినిమా కాబట్టి ముందుగా సంజూభాయ్‌ అనుమతి తీసుకున్నారుట. తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ సినిమా కోసం ఐష్‌ ఏకంగా 10 కోట్లు డిమాండ్‌ చేశారని తెలుస్తోంది. అంత పెద్ద మొత్తం డిమాండ్‌ చేయడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటించాల్సి ఉంది. అందుకోసం చాలానే ప్రిపరేషన్‌ అవసరం. శ్రమకు తగ్గ పారితోషికం డిమాండ్‌ చేశారని నిర్మాత కృతి అరోరా అంగీకరిస్తున్నారు. ఆ మొత్తం ఐష్‌కి ఇవ్వడం తప్పేవిూ కాదని అభిప్రాయపడ్డారు. 'ది రాత్‌ ఔర్‌ దిన్‌' చిత్రంలో నర్గీస్‌ దత్‌ ప్రయోగాత్మకంగా రెండు షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Comments