ఉమ్మడి హైకోర్టు విభజనకు గ్రీన్‌ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ ఆవిర్భావం రోజైన జూన్‌ 2 నుంచి రెండు రాష్ట్రాలకు వేరు వేరు హైకోర్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. హైకోర్టు విభజనకు కేంద్ర న్యాయశాఖ అంగీకరించింది. త్వరలోనే దీనికి సంబంధించి రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. దానికనుగుణంగా ప్రధాన న్యాయమూర్తి చర్యలు తీసుకుంటారు. ఏపీ హైకోర్టును అమరావతికి తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.

Comments