రాజా మార్తాండ వర్మగా రానా

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రానా దగ్గుబాటి. తెలుగు,తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రాలు 1945, హాథీమేరి సాథీ సినిమాల్లో నటిస్తున్న రానా ఇప్పుడు మరో సినిమాను సెట్స్‌ పైకి తీసుకుకొచ్చాడు. ఓ మలయాళ సినిమాలో రానా నటిస్తున్నారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. ట్రావెన్‌ కోర్‌ రాజు మార్తండ వర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజా మార్తండ వర్మగా రానా నటిస్తున్నాడు రానా. 18వ శతాబ్ధంలో జరిగిన కథతో భారీ చారిత్రక చిత్రంగా డైరక్టర్‌ కె.మధు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మార్తండ వర్మ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా 2018లోనే రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తున్నారు.

Comments