డార్లింగ్‌తో సారా అలీఖాన్‌

బాహుబలితో ప్రభాస్‌ టాలీవుడ్‌..బాలీవుడ్‌లో కూడా మోస్ట్‌ పవర్‌ఫుల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు. ఆయన సినిమాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకుంది. ప్రభాస్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. భారీ కాస్టింగ్‌ కూడా అవసరమవుతోంది. సాహోలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌ నటిస్తుండగా..తదుపరి జిల్‌ దర్శకుడు రాధాకృష్ణతో తీయనున్న చిత్రానికి ముందుగా దీపికా పడుకునేను సంప్రదించగా..పద్మావత్‌ గొడవల్లో ఉండటంతో అయిష్టంగానే నో అంది. మళ్లీ హీరోయిన్ల కోసం ఇండస్ట్రీలను జల్లెడ పట్టిన దర్శక - నిర్మాతలు ఈ సారి సైఫ్‌ అలీఖాన్‌ మొదటి భార్య కూతరు సారా అలీఖాన్‌ కు స్టోరీ లైన్‌ వినిపించారట. స్టోరీ బాగుందని, తాను యాక్ట్‌ చేసే విషయం లో తన తల్లి సారా సలహా తీసుకోవాలని చెప్పిందట. ఆమె సినిమా కు ఒప్పుకుంటే కొత్త సినిమా చేయాలనే ప్రభాస్‌ ఎదురు చూస్తున్నాడు. అంత అనుకున్నట్టు జరిగితే సారా అతి త్వరలో ప్రభాస్‌ సరసన మన ముందుకు రావచ్చు.

Comments