తమన్నా..అందాల రాక్షసి. మిల్క్‌బ్యూటీ..తన అందచందాలతో కుర్రకారును లవ్‌డబ్ చేయగల యాపిల్ బ్యూటీ. అతికొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు. ఈనాటి డ్యాన్స్‌లో కూడా తనకంటూ ప్రత్యేకత చాటుకుంది. బన్నితో అయితే పోటీపడి భద్రీనాథ్‌లో డ్యాన్స్ చేసింది. రచ్చ సినిమాలో రాంచరణ్‌తో చేసిన వాన సాంగ్ ఎందర్నో డిస్టర్బ్ చేసింది. ప్రత్యేక గీతాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. ఈ మధ్య కాస్త వెనుకబడినా..మళ్లీ దూసుకొచ్చేలా 2018ను ప్లాన్ చేసుకుంది. ఇక ఆఫర్స్ ను కూడా తన రేంజ్ వరకు బాగానే అందుకుంటోంది. స్పెషల్ సాంగ్స్ తో స్పెషల్ రెమ్యునరేషన్స్ కూడా అందుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో తమన్నా మూడు సినిమాలతో బిజీగా ఉంది. సందీప్ కిషన్ కొత్త సినిమాతో పాటు బాలీవుడ్ క్వీన్ రీమేక్ లో కూడా నటిస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే తమన్నా ఆ సినిమాలో రేడియో జాకీగా కనిపించనుందట. కూల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండే ఆ కథలో అమ్మడి పాత్ర అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కళ్యాణ్ రామ్ కూడా చాలా కొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక సిద్దార్థ్ తో 180 మూవీ తీసిన యాడ్స్ ఫిల్మ్ డైరెక్టర్ జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఫెమస్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు

Comments
Post a Comment