విద్యార్థులకు లేడీ టీచర్ వికృత బోధన
రాయ్‌పూర్ : పొట్టి బట్టలు వేసుకుని అందాలు కనిపించేలా ఉంటే కుర్రకారు ఊరుకుంటారా? ఇష్టం వచ్చినట్టు ఫ్యాషన్లు ఫాలో అయితే రేప్‌లకు మీరే అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఓ లేడీ టీచర్ విద్యార్థులకు బోధించి వివాదస్పదమయ్యారు. ఈ సంచలన సూచనలతో భయపడిన విద్యార్థులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి ఆ టీచర్‌పై స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌లోని ఓ కేంద్రీయ విద్యాలయంలో స్నేహలత శంఖ్వార్ అనే బయాలజీ టీచర్ తొమ్మిది, ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థులకు ఇచ్చే కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థినులకు ఆమె సలహాలు ఇస్తూ అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే, లిప్‌స్టిక్ పెట్టుకుంటే ప్రమాదం అన్నారు. అలా చేసేవారిపై నిర్భయ దాడి ఘటనలు జరుగుతాయని, పరోక్షంగా వారే లైంగిక దాడికి ఆహ్వానించిన వాళ్లవుతారని అన్నారు. 'అందమైన ముఖాలు లేనప్పుడు మాత్రమే అమ్మాయిలు తమ శరీరాన్ని బయటకు చూపించాలి. అమ్మాయిలు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నారు. తన భర్త కూడా కానీ ఒకబ్బాయితో నిర్భయ అంతరాత్రి వేళ ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? ఇలాంటివి ఎందుకు చేస్తారో అర్థం చేసుకోవడానికే కష్టంగా ఉంది. ఎజెన్సీ ప్రాంతాల్లోనే అలాంటి ఘటనలు తరుచుగా జరుగుతుంటాయి. రాత్రిపూట నిర్భయతల్లి ఆమెను బయటకు వెళ్లనీయొద్దు. నా ఉద్దేశంలో తప్పు నిర్భయదే.. అలా చేసే అమ్మాయిలదే.. అబ్బాయిల తప్పుకాదు. ఇలాంటి సంఘటనలు ఒకవేళ అమ్మాయిలు ఎదుర్కొంటున్నారంటే అది వారు చేసిన పాపాలకు అనుభవించే శిక్ష తప్ప మరొకటి కాదు. ఏ అమ్మాయి తన శరీరాన్ని బయటకు చూపాలని ఆరాటపడుతుందో ఆ అమ్మాయిని ఒకబ్బాయి క్యారెక్టర్ లేని అమ్మాయనే అనుకుంటాడు' అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, పూర్తి వివరాలు తెలుసుకొని ఆ టీచర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ కూడా హావిూ ఇచ్చారు.

Comments
Post a Comment