ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ గిరిజన బాలికపై బస్సుడ్రైవర్ విశ్వానాథ్ అత్యాచారం చేశాడు.విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో బస్సు డ్రైవర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీఈపీజెడ్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. తాను చేసిన నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు అతను బాలికతో బేరమాడాడు.జరిగిన సంఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండడానికి రూ. 1.50 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అత్యాచారం కేసును సుమోటోగా నమోదు చేశారు. పోలీసులు నిందితుడు విశ్వనాథ్ సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
..............................
క్యాన్సర్ బాధితురాలిపై ఓ గుంపు సామూహిక అత్యాచారానికి పాల్పడింది. 16 ఏళ్ల బాలికపై దుండగులు లక్నోలో ఇటీవల గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక సరుకులు కొనడానికి వెళ్లిన బాలికను తెలిసిన వ్యక్తి ఒకతను తనతో తీసుకుని వెళ్లాడని, అతనితోపాటు ఆయన మిత్రులు ఆమెపై అత్యాచారం చేసి ఆమెను రోడ్డు పక్కన పడేసి వెళ్లారు.
.......
తాజాగా గజల్ శ్రీనివాస్.. మహిళను లైంగికంగా వేధించాడని, లైంగిక వాంఛ తీర్చకపోతే ఉద్యోగంలోంచి తీసివేస్తానని బెదిరించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం..పోలీసులు గజల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే...ఈ వ్యవహారంలో నిజనిజాలు ఎలా ఉన్నా...మహిళలకు మాత్రం రక్షణ లేకుండా పోతుందనేది నగ్నసత్యం.
...........................................
'ఆమె లేనిదే అమ్మ లేదు..'ఆమె' లేనిదే అక్క లేదు..'ఆమె' లేనిదే చెల్లి లేదు..'ఆమె' లేనిదే భార్య లేదు.. అసలు 'ఆమె' లేనిదే లోకమే లేదు. ఎక్కడైతే 'ఆమె' పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని ఉగ్గుపాల నుంచీ చెబుతూనే ఉన్నారు... అయితే 'ఆమె'ను మనం అలానే గుర్తిస్తున్నామా? అలానే ప్రేమిస్తున్నామా? అలానే కంటికి రెప్పలా కాపాడుతున్నామా? ఈ ప్రశ్నలంటికీ సమాధానం చెప్పాలంటే కాస్త ఆలోచించాల్సిందే.. ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్నలివి. 'మన దేశంలో రెండు మహా పాతకాలున్నాయి. ఒకటి స్త్రీలను అణగదొక్కడం, రెండవది పేదవారిని కుల నిబంధనలతో రాచి రంపాన పెట్టటం' అని జై భారతీయ విప్లవానికి కొనసాగింపుగా స్వామి వివేకానంద ఆనాడే ఇప్పటి హైఫై కల్చర్‌ను ఊహించి చెప్పారు. మహిళలు ఎప్పుడైతే అర్థ్ధరాత్రి నిర్భయంగా బయటకు రాగలుగుతారో అప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని మహాత్మాగాంధీ చెప్పారు. నిజమే అర్థరాత్రి కాదు కదా.. ఏ సమయంలోనూ స్త్రీకి రక్షణ లేదు. నిర్భయ, రిషికేశ్వరి లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం సీరియస్‌గా హడావుడి చేస్తుంది. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లిలో నూకాంబికా ఆలయానికి వెళ్లివస్తున్న కుటుంబాన్ని వేధించి కారుతో ఢీకొని లావణ్య మరణానికి కారకులయ్యారు పోకిరీగాళ్లు. మగాడు మృగాడిగా మారిపోతున్నా.. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. వెధవ పనులు చేసే వారిలో పలుకుబడి గల వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో రాజకీయ నాయకులు అండదండలతో ఆయా కేసులను నీరుగారుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని కేసుల్లోనూ ఇదే తంతు జరుగుతోంది. అత్యాచారాలు దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. మగాడు మృగాడిగా మారడంలో కారణాలు ఏంటి? ఆ పాపం తల్లిదండ్రులదా? సమాజానిదా? అంటూ టీవీషోల్లో చర్చలు కొనసాగడం పరిపాటిగా మారుతున్నాయి. అన్నిరంగాల్లో మహిళలు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతున్నా చంద'మామ' అన్న వాడు పైన ఒకటున్నాడు. ఎక్కడ చూసినా పురుషులు మహిళలను అణగతొక్కాలనే చూస్తున్నారు. అందంగా ఉన్నా.. తనకంటే గొప్పగా ఉన్నా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. ఎలాగైనా 'ఆమె'ను లొంగతీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆత్మాభిమానం ఉన్నవాళ్లు ఎదురు తిరిగితే ఓ నిర్భయ, మరో రిషికేశ్వరి.. మన లావణ్య,చెన్నైలో స్వాతికి పట్టిన గతే పడుతుంది. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించనంతకాలం.. పురుషుల్లో మార్పు రానంతకాలం.. తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో శ్రద్ధ తీసుకోలేనంతకాలం.. ఈ దుశ్శాసునులు ఇలాగే రెచ్చిపోతారు. ఈ సంఘటనలపై సీరియస్‌గా వ్యవహరించకపోతే మరిన్ని పరిమళాలు ఏమిటీ మాకీ శిక్ష అంటూ కన్నుమూస్తాయి.

Comments
Post a Comment