సైరా కోసమేనా?
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తర్వాత తన 150వ చిత్రం ఖైదీ నెం 150తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. ఇక ఇప్పుడు తన 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో సైరా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ఉండాలని భావించిన చిరు, ఏ విషయంలోను కాంప్రమైజ్ కావడం లేదట. రామ్ చరణ్ దగ్గరుండి మరీ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌కి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఫిబ్రవరి నెలాఖర్లో రెండో షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. అయితే న్యూయర్ సందర్భంగా చిరు పాత గెటప్ నుండి ఫ్రెష్ లుక్‌లోకి మారాడు. గుబురు గడ్డం, పొడుగు విూసాలు అన్నీ తీసేశాడు. దీంతో అభిమానులలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. దర్శకుడి విషయంలో చిరు అసంతృప్తిగా ఉండడంతో వేరే దర్శకుడిని తీసుకోవాలని భావిస్తున్నారని వస్తున్న వార్తలు నిజమేనా, సైరా షెడ్యూల్ షూటింగ్ డిలే కానుందా.. ఇలా ఎన్నో వార్తలు అభిమానులనను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయితే రెండో షెడ్యూల్‌కి రెండు నెలలు టైం ఉంది కాబట్టి, చిరు మళ్లీ పాత గెటప్‌లోకి రావడానికి ఈ టైం చాలని మెగా సన్నిహితులు అంటున్నారు. సోషల్ విూడియాలో వస్తున్న వార్తలు అన్ని పుకార్లని వాళ్లు కొట్టి పారేస్తున్నారు.

Comments
Post a Comment