మళ్లీ అక్కడ అమ్మాయి...

'అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి'లో హీరోయిన్‌ గుర్తుంది కదూ...ఆమె సుప్రియ..నాగార్జున మేనకోడలు..ఇప్పుడు ఆ విషయంలో ఎందుకనేదేగే మీ డౌటు. అదేనండీ మళ్లీ సుప్రియ ముఖానికి రంగేసుకుంటుంది. అడవి శేషు హీరోగా నటిస్తున్న గూఢాచారి సినిమాలో సుప్రియ కీలక పాత్ర పోషిస్తోంది. శశికిరణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాజీ మిస్‌ ఇండియా శోభితా దూళిపాల హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. జనవరి 14న ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనున్నారు.

Comments